పాకిస్తాన్ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిదీ పిరికివాడని అంటున్న సునీల్ శెట్టి
భారతీయులు విశాల హృదయులు కారని పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ షాహిద్ ఆఫ్రిదీ చేసిన వ్యాఖ్యపై బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి తీవ్రంగా మండిపడ్డాడు. ఆఫ్రిదీని ఆయన పిరికివాడిగా అభివర్ణించాడు. పాకిస్తాన్, భారత్ మధ్య జరిగిన మొహాలీ టెస్టు మ్యాచును సునీల్ శెట్టి వీక్షించాడు. భారత్‌పై విమర్శలు చేయడానికి ముందు తాము ఏం చేశామో షాహిద్ అతని సోదరుడిని అడగాలని సునీల్ శెట్టి అన్నాడు. షాహిద్ సోదరుడు మ్యాచు ముగిసే వరకు తమతో మాట్లాడుతూ తమతోనే ఉన్నాడని చెప్పాడు. మ్యాచును చూడడానికి వచ్చిన ప్రతి ఒక్కరి పట్ల తాము స్నేహవూర్వకంగా వ్యవహరించామని చెప్పాడు.
పాకిస్తానీలు తమ ఇంట్లో ఉన్నట్లు ఫీలయ్యేలా తాము చూశామని అన్నాడు. ఆఫ్రిదీ తన నోరు భారతదేశంలోనే తెరవాల్సిందని అతను అన్నాడు. పాకిస్తాన్‌కు తిరిగి వెళ్లిన తర్వాత అంతటి వ్యతిరేక వ్యాఖ్యలు ఎందుకు చేశాడని సునీల్ శెట్టి అడిగాడు. ఆఫ్రిదీ చౌకబారు వ్యవహారమని, ఓ దేశ క్రికెట్ జట్టు కెప్టెన్‌గా ఆఫ్రదీ బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిందని చెప్పాడు. తాము ఎంతగా గౌరవించామో ఆఫ్రిదీ షోయబ్ అక్తర్‌ను అడగాల్సిందని అతను అన్నాడు.


Click it and Unblock the Notifications











