»   » ట్రైలర్ సెక్సీగా : 24 గంటల్లో... లక్ష హిట్స్‌

ట్రైలర్ సెక్సీగా : 24 గంటల్లో... లక్ష హిట్స్‌

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్‌ స్టార్స్ షాహిద్‌ కపూర్‌, ఆలియా భట్‌లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'షాన్‌దార్‌'. ఈ చిత్రం ట్రైలర్‌ ఇప్పటికే విడుదలైంది. ఈ వీడియో యూట్యూబ్‌లో విడుదలై 24 గంటలు కాకముందే లక్ష మందికిపైగా చూడటం రికార్డ్ క్రియేట్ చేసింది.ఈ చిత్రానికి వికాస్‌ బహల్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

అక్టోబర్‌ 22న 'షాన్‌దార్‌'ను విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. కరణ్‌ జోహార్‌ నిర్మిస్తున్న 'షాన్‌దార్‌' సినిమా అక్టోబర్‌ 22న విడుదల కానుంది. ఈ ట్రైలర్ ని మీరూ ఇప్పటికి చూడకపోతే చూసేయండి..

వెండితెరపై తొలిసారి షాహిద్‌ కపూర్‌, అలియా భట్‌ జంటగా నటిస్తున్న చిత్రమిది. 'స్టూడెంట్‌ నెంబర్‌ 1' సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తూనే పెద్ద హిట్‌ కొట్టింది అలియా భట్‌. షాహిద్‌ కపూర్‌, బాలీవుడ్‌లో స్టార్‌ హీరో. వీరిద్దరి మధ్యా సినిమాలో రొమాన్స్‌ బాగా పండిందట. తన కెరీర్‌లోనే ది బెస్ట్‌ మూవీగా 'షాన్‌దార్‌'ని అభివర్ణిస్తున్నాడు షాహిద్‌ కపూర్‌.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఇక ఈ ట్రైలర్ లో బాలీవుడ్ సెక్సీ బ్యూటీ అలియా భట్ మరోసారి రెచ్చిపోయి అందాలు ఆరబోసింది. ఎప్పటికప్పుడు తన అందాలతో మత్తెక్కించే ఈ సౌందర్యరాశి ఈ సారి మరీ టూపీస్ బికినీతో కుర్రకారుకు విందు చేసింది. తన తొలి సినిమా స్టూడెంట్ ఆఫ్ ది ఇయిర్ లోనే టూ పీస్ బికినీలో అదరకొట్టిన ఈమె ఇప్పుడు మరోసారి అలాంటి స్కీమ్ తోనే ముందుకు వచ్చింది. తన తాజా చిత్రం షాన్ దార్ కోసం ఆమె బికినీ వేసి ఆకట్టుకునే ప్రయత్నం మొదలెట్టింది.

English summary
Actor Shahid Kapoor and Alia Bhatt's upcoming movie Shandaar trailer is out and if you thought Vikas Bahl did his best while making 'Queen', then make up your mind for the double fun, celebration and drama. The 3 minute video shows two loud and crazy Punjabi families.
Please Wait while comments are loading...