twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆమె ఓ ఎద్దు..హీరో విసుర్లు

    By Staff
    |

    Kareena Kapoor
    కరీనా, షాహిద్ కలిసున్నన్నాళ్ళూ తామంత గొప్ప జంట ప్రపంచంలో మరొకరు లేరన్నట్లు మాట్లాడేవారు...తిరిగేవారు. ఇప్పుడు వారు విడిపోయాక విడివిడిగా..ఘాటుగా రకరకాల స్టేట్ మెంట్స్ ఇస్తున్నారు. తాజాగా షాహిద్ ని మీడియా వారు మీరు మళ్ళీ కరీనా ప్రక్కన చేస్తారా అన్న దానికి సమాధానంగా నిర్మాత ఎవరు ప్రక్కన చేయమన్నా చేస్తాను.అది నా వృత్తి. అతను ఎద్దుతోనో, ఆవుతోనో రొమాన్స్ చేయమన్నా చేయాలి అన్నాడు. అది కరీనానే ఉద్దేశించి అతను అన్నవి కావటంతో ఎవరూ తిరిగి ప్రశ్నించలేదు.

    కానీ షాహిద్ ఆమెను ఎద్దుతో పోల్చటాన్ని మాత్రం చాలా మందికి నచ్చలేదు. వాళ్ళిద్దరు మధ్యా ఎన్నైనా ఉండవచ్చు గానీ ఇలా రోడ్డెక్కి కామెంట్స్ చేయటం అసహ్యంగా ఉందని అంటున్నారు. జీ న్యూస్ వారి సెలిబ్రెటీ ఛాట్ షో లో ఈ ప్రస్దావన వచ్చింది. షాహిద్, కరీనా గతంలో ఫిదా చిత్రం నుంచి చుప్ చుప్ కే దాకా చేసారు. చివరలో చేసిన జబ్ వుయ్ మెట్ అయితే సూపర్ హిట్ అయి కూర్చుంది. ఇక మీకూ సానియా మీర్జాకి ఎఫైర్ నడుస్తోందని వినపడుతోందని అంటే..నాకు ఆమె మంచి స్నేహితురాలు..అలాగే నా పర్శనల్ లైఫ్ గురించి చర్చించటం నాకు ఇష్టం ఉండదని కట్ చేసాడు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X