»   » మరో హీరో పెళ్లి పీటలెక్కబోతున్నాడు, ఇదిగో వెడ్డింగ్ కార్డ్ (ఫోటోస్)

మరో హీరో పెళ్లి పీటలెక్కబోతున్నాడు, ఇదిగో వెడ్డింగ్ కార్డ్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదనుకుంటా. బాలీవుడ్లో లవర్ బాయ్ హీరోల లిస్టులో షాహిద్ టాప్ లో ఉంటాడు. కరీనా కపూర్ తో మొదలు కొని ప్రియాంక చోప్రా వరకు పలు బిటౌన్ హీరోయిన్లతో ఎఫైర్ల నడిపిన షాహిద్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు.

త్వరలో షాహిద్ ఢిల్లీకి చెందిన అమ్మాయి మీరా రాజ్‌పుత్‌ను పెళ్లాడబోతున్నాడు. వీరి వివాహం జులై 7న గుర్‌గావ్‌లో జరుగబోతోంది. వెడ్డింగ్ కార్డులు రెడీ అయ్యాయి. ముంబై సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం వీరి వివాహం కేవలం కుటుంబ సభ్యులు, కొందరు క్లోజ్ ఫ్రెండ్స్ సమక్షంలో జరుగబోతోందని తెలుస్తోంది. వెడ్డింగ్ రిసెప్షన్ గ్రాండ్ గా సినీ ప్రముఖులందరినీ పిలిచి జరుపుకుంటారని అంటున్నారు.

షాహిద్ పెళ్లి పనులు దగ్గరుండి చూసుకునేందుకు అతడి ముగ్గురమ్మలూ రంగంలోకి దిగుతున్నారు. తమ ముద్దుల కొడుకును పెళ్లికొడుకును చేసి తమ ముచ్చట తీర్చుకోబోతున్నారు. ఇంతకూ ఈ ముగ్గురు అమ్మలు ఎవరంటారా? షాహిద్ సొంతతల్లి, పెంచిన తల్లి, సవితి తల్లులేనట.

ఈ ముగ్గురు అమ్మలూ షాహిద్ జీవితంలో కీలక పాత్ర పోషించిన వారే. తల్లి నీలిమా ఆజిమ్ తండ్రి పంకజ్ కపూర్ విడాకులు తీసుకున్న తరువాత షాహిద్ కొంతకాలం తండ్రి వద్దా, కొంతకాలం తల్లి వద్దా పెరిగాడు. అలా... తండ్రి రెండో భార్య అయిన సుప్రియా పాఠక్ కూ, తల్లి రెండో భర్త అయిన రాజేశ్ ఖత్తార్ కూ షాహిద్ దగ్గరయ్యాడు. వారు కూడా అతన్ని సొంత కొడుకులాగానే సాకారు. ఇక.... తల్లి నీలిమా ఆజిమ్, రాజేశ్ కత్తార్ తోనూ తెగదెంపులు చేసుకున్నాక అతడు వందన సజ్నానీని వివాహమాడాడు. అలా... ఆమెతోనూ షాహిద్ కు మంచి సంబంధబాంధవ్యాలు ఏర్పడ్డాయి. స్లైడ్ షోలో ఫోటోలు..

వెడ్డింగ్ కార్డ్
  

వెడ్డింగ్ కార్డ్

షాహిద్ కపూర్, మీరా రాజ్ పుత్ వెడ్డింగ్ కార్డ్ ఫస్ట్ లుక్ ఇదే.

షాహిద్ ఫ్యామిలీ
  

షాహిద్ ఫ్యామిలీ

తన ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి షాహిద్ కపూర్.

షాహిద్-ఇషాన్
  

షాహిద్-ఇషాన్

షాహిద్ కపూర్ సోదరుడు ఇసాన్....వెడ్డింగ్ కార్డును స్పెషల్ గా డిజైన్ చేయించాడట.

షాహిద్-సనా
  

షాహిద్-సనా

షాహిద్ కపూర్ సిస్టర్ సనా కపూర్ కూడా ఈ పెళ్లి వేడుకలో ముఖ్య పాత్ర పోషిస్తోంది.

షాహిద్-నీలిమా-ఇషాన్
  

షాహిద్-నీలిమా-ఇషాన్

షాహిద్ పెళ్లి వేడుక ఏర్పాట్లు చూసుకునేందుకు షాహిద్ సొంతతల్లి నీలిమా అజిమ్, సవితి తల్లి సుప్రియా పాఠక్, పెంచిన తల్లి వందన సజ్నానీ రంగంలోకి దిగారు.

షాహిద్-మీరా
  

షాహిద్-మీరా

బాలీవుడ్ తో సంబంధం లేని అమ్మాయినే షాహిద్ పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. తాను అనుకున్న విధంగానే మీరాను పెళ్లాడబోతున్నాడు.

ఫ్రెండ్స్ తో కలిసి మీరా
  

ఫ్రెండ్స్ తో కలిసి మీరా

మీరా రాజ్ పుత్ షాహిద్ కపూర్ కంటే 13 సంవత్సరాలు చిన్నది.

కాలేజీ అమ్మాయే
  

కాలేజీ అమ్మాయే

మీరా రాజ్ పుత్ ఇంకా కాలేజీ అమ్మాయే. ఢిల్లీలో డిగ్రీ థర్డ్ ఇయర్ చదువుతోంది.

కాబోయే భార్య
  

కాబోయే భార్య

వీరి వివాహం గుర్ గావ్ లో ప్లాన్ చేసారు.

షాహిద్
  

షాహిద్

పెళ్లి వేడుక సాదా సీదాగా జరుగుతుంది. కానీ ముంబైలో వెడ్డింగ్ రిసెప్షన్ గ్రాండ్ గా జరుగుతుంది.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu