షాహిద్ కపూర్ పెళ్లాడబోయే అమ్మాయి ఈవిడే (ఫోటో)
హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదనుకుంటా. బాలీవుడ్లో లవర్ బాయ్ హీరోల లిస్టులో షాహిద్ టాప్ లో ఉంటాడు. కరీనా కపూర్ తో మొదలు కొని ప్రియాంక చోప్రా వరకు పలు బిటౌన్ హీరోయిన్లతో ఎఫైర్ల నడిపిన షాహిద్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు.
త్వరలో షాహిద్ ఢిల్లీకి చెందిన అమ్మాయి మీరా రాజ్‌పుత్‌ను పెళ్లాడబోతున్నాడు. వీరి వివాహం జూన్ నెలలో జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ముంబై సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం వీరి వివాహం కేవలం కుటుంబ సభ్యులు, కొందరు క్లోజ్ ఫ్రెండ్స్ సమక్షంలో జరుగబోతోందని తెలుస్తోంది. వెడ్డింగ్ రిసెప్షన్ గ్రాండ్ గా సినీ ప్రముఖులందరినీ పిలిచి జరుపుకుంటారని అంటున్నారు.

షాహిద్ కపూర్, మీరా రాజ్ పుత్ పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ కొంతకాలంగా డేటింగ్ కూడా చేస్తున్నారు. అయితే ముందే వీరి పెళ్లి విషయం బయటకు లీక్ కావడంపై మీరా రాజ్ పుత్ కుటుంబ సభ్యులు ఆందోళన పడుతున్నట్లు టాక్. ప్రస్తుతం మీరా కాలేజీ చదువు కొనసాగిస్తున్న నేపత్యంలో ఈ వార్త లీక్ ఆమెకు ఇబ్బందులు తెచ్చిపెడుతుందని ఆందోలన చెందుతున్నారు.
షాహిద్ కపూర్ తో డేటింగ్ విషయాన్ని మీరా తన స్నేహితులతో చెప్పడం వల్లనే వారి ద్వారా విషయం బయటకు లీకైనట్లు తెలుస్తోంది. అప్పటి నుండి సదరు స్నేహితులకు మీరా దూరంగా ఉంటోందట. మీడియా ఆర్బాటం లేకుండా ఈ పెళ్లి ప్రశాంతంగా జరుగాలని మీరా కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











