లవర్ బాయ్ షాకింగ్ లుక్, లేడీ ఫ్యాన్స్ అప్‌సెట్ (ఫోటోలు)

By Bojja Kumar

ముంబై: బాలీవుడ్ సినీ పరిశ్రమలో లవర్ బాయ్‌గా పేరు తెచ్చుకున్న షాహిద్ కపూర్ తన లేటెస్ట్ మూవీ 'హైదర్' చిత్రం కోసం గుండుతో షాకింగ్ లుక్‌లోకి మారాడు. ఈ చిత్రానికి విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ముంబైలో ఓ కార్యక్రమానికి హాజరైన షాహిద్ కపూర్ లుక్ చూసి అంతా ఆశ్చర్యపోయారు.

సోషల్ నెట్వర్కింగులో కూడా ఈ విషయం చర్చనీయాంశం అయింది. ముఖ్యంగా లేడీ అభిమానులు షాహిద్‌ను ఈ లుక్‌లో చూసి భరించలేక పోతున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు, సినిమాకు సంబంధించిన వివరాలు స్లైడ్ షోలో....

షాహిద్ కపూర్

షాహిద్ కపూర్

ముంబైలోని ఓ కార్యక్రమానికి హాజరైన షాహిద్ కపూర్......తనను ఫోటో గ్రాఫర్లు వివిధ యాంగిల్స్‌లో ఫోటోలు తీస్తుంటే ఇబ్బంది పడ్డారు. అతని లేడీ మేనేజర్ ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీయకుండా అడ్డుకునే ప్రయత్నం చేసింది.

ఈ సినిమా చేస్తున్నందుకు గర్వంగా ఉంది

ఈ సినిమా చేస్తున్నందుకు గర్వంగా ఉంది


హైదర్ సినిమా చేస్తున్నందుకు షాహిద్ కపూర్ చాలా గర్వంగా ఫీలవుతున్నాడు. షేక్స్ పియర్ డ్రామా ‘హామ్లెట్' ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. షేక్స్ పియర్ డ్రామా ఆధారంగా గతంలో విశాల్ భరద్వాజ్ రెండు చిత్రాలు తెరకెక్కించారు. గతంలో ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘ఓంకార', ‘మగ్భూల్' చిత్రాలు ఆ కోవకు చెందినవే.

షాహిద్ కపూర్ అమీర్ ఖాన్‌ను ఇమిటేట్ చేస్తున్నాడా?

షాహిద్ కపూర్ అమీర్ ఖాన్‌ను ఇమిటేట్ చేస్తున్నాడా?

ఇక్కడ షాహిద్ కపూర్ టోపీ చూసారా? ఇటీవల అమీర్ ఖాన్ ధూమ్ 3 సినిమాలో వాడారు. ధూమ్ 3 మూవీ ప్రమోషన్ల సందర్భంగా కూడా అమీర్ ఖాన్ ఇలాంటి క్యాపులు పెట్టుకుని దర్శనమిచ్చాడు.

షాహిద్ కపూర్ న్యూ అవతార్

షాహిద్ కపూర్ న్యూ అవతార్


హైదర్ సినిమాలో షాహిద్ కపూర్ ఇలాంటి అవతారంలో కనిపించబోతున్నాడు. అందుకు సంబంధించిన ఫోటోలను వివిధ యాంగిల్స్‌లో ఇక్కడ చూడొచ్చు.

హైదర్ చిత్రంపై భారీ అంచనాలు

హైదర్ చిత్రంపై భారీ అంచనాలు


విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వహిస్తున్న ‘హైదర్' చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో షాహిద్ ఎంతో కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రంలో ఇంకా టబు, శ్రద్ధా కపూర్, ఇర్ఫాన్ ఖాన్ ముఖ్య మైన పాత్రలు పోషిస్తున్నారు.

More from Filmibeat

Read more about: shahid kapoor bald look haider
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X