twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నేను స్టార్‌ని కాదు.. సూపర్‌స్టార్‌ని.. ఓ పత్రిక ఎడిటర్‌పై హీరో వీరంగం

    బాలీవుడ్ స్టార్ షాహీద్ కపూర్ ఇటీవల ఓ పత్రిక ఎడిటర్‌తో ప్రవర్తించిన తీరు వివాదాస్పదమైంది.

    By Rajababu
    |

    బాలీవుడ్ స్టార్ షాహీద్ కపూర్ ఇటీవల ఓ పత్రిక ఎడిటర్‌తో ప్రవర్తించిన తీరు వివాదాస్పదమైంది. తనను స్టార్ కాకుండా సూపర్‌స్టార్ అని సంభోదించాలని ఎడిటర్‌పై ఒత్తిడి తీసుకు వచ్చినట్టు ఓ వార్త వెలుగులోకి వచ్చింది. రంగూన్ చిత్రం విడుదలకు ముందు ఓ స్టోరీని ప్రచురించాలని పత్రిక సంపాదకుడు ప్లాన్ చేశారట. ఆ స్టోరి ప్రచురించడానికి ముందు ఈ ఘటన చోటుచేసుకొన్నట్టు ఇటీవల ఓ వ్యక్తి మీడియాకు వెల్లడించారు.

    షాహీద్ స్టారా? సూపర్‌స్టారా?

    షాహీద్ స్టారా? సూపర్‌స్టారా?

    బాలీవుడ్ షాహీద్ కపూర్ మంచి నటుడన్నది కాదనలేము. కానీ స్టారా లేదా సూపర్‌స్టారా అని చెప్పడానికి కచ్చితంగా కొలమానం అంటూ ఏమిలేదు. కానీ అతడు మాత్రం తాను సూపర్‌స్టార్ అనే భావనలో ఉన్నాడనే తాజా సమాచారం. అయితే ఆ మేరకు పత్రిక ఉద్యోగులపై ఒత్తిడి తేవడం బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది.

    రంగూన్‌కు ముందు ఘటన

    రంగూన్‌కు ముందు ఘటన

    ఈ వ్యవహారంలో అసలేం జరిగిందంటే.. రంగూన్‌కు ముందు షాషీద్‌తో ఇంటర్వ్యూ కోసం ఓ బృందం వెళ్లింది. ఆ తర్వాత స్టోరీని తయారు చేసి ప్రింటింగ్ కోసం పంపించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ సమయంలో మ్యాగజైన్ ఎడిటర్ షాహీద్ ఫోన్ చేసి వాగ్వాదానికి దిగాడు.

    టైటిల్ మార్చండి

    టైటిల్ మార్చండి

    ‘నన్ను స్టార్‌గా చూడవద్దు. హెడ్‌లైన్‌లో సూపర్‌స్టార్‌గా చూడాలి. అలానే ప్రచురించాలి. షాహీద్ కోరిక మేరకు టైటిల్‌ను మార్చడానికి అసలే ఒప్పుకోలేదట సదరు ఎడిటర్. షాహీద్ మాటలను లెక్క చేయకుండా స్టోరీని మొత్తానికే ఆపివేశాడట.

    రంగూన్ ఫ్లాప్ తర్వాత

    రంగూన్ ఫ్లాప్ తర్వాత

    ఇదంతా జరిగిన కొన్ని రోజులకు రంగూన్ విడుదలైంది. బాలీవుడ్‌లో అతి దారుణమైన పరాజయం పొందిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. షాహీద్ తీరుపై చాలా పిచ్చిగా అనిపించిందని సదరు ఎడిటర్ వ్యాఖ్యానించినట్టు సమాచారం. ఆ తర్వాత కొన్ని రోజులకు టైటిల్ మార్చి వేరేగా ప్రచురించినట్టు ఆయన చెప్పుకొచ్చారు.

    English summary
    Shahid Kapoor did a photoshoot for the cover of a 'popular film glossy' a few days before the release of his film Rangoon. When the magazine's team sent Shahid a scan of the feature story, before the issue was sent to the press for printing, Shahid apparently 'balked', according to the magazine's editor. Shahid, reportedly, did not like being called a 'star' in the story's headline and demanded that 'star' should be changed to 'superstar'.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X