ఆమె పోతేనేం ఇంకొకామె ఉంది కదా!!!
షాహిద్ కపూర్ లవ్ స్టోరీ చూస్తుంటే శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా గుర్తోస్తోంది. లవ్ కోసం ప్రాణాలు అర్పించాల్సిన అవసరం లేదన్నట్టు కరీనా కపూర్ ను నాలుగేళ్ల పాటు ప్రేమించిన షాహిద్ పరిస్థితి ఇపుడు తయారైంది. షాహిద్ ను పిచ్చిగా ప్రేమిస్తున్నానని, పెళ్లంటూ చేసుకుంటే షాహిద్ నే చేసుకుంటానని స్టేట్ మెంట్ల మీద స్టేట్ మెంట్లు ఇచ్చిన కరీనా కపూర్ ఇపుడు షాహిద్ కు చెయ్యిచ్చి సైఫ్ అలీఖాన్ చేయిపట్టుకున్న సంగతి తెలిసిందే.
లవర్ పెళ్లిచేసుకొని వెళ్లిపోతే మా గళ్లీకి ఐశ్వర్య వచ్చిందని శంకర్ దాదా ఎంబీబీఎస్ లో చిరంజీవి అన్నట్టుగానే షాహిద్ కపూర్ లైఫ్ లోకి మరో అమ్మాయి వచ్చిచేరింది. అయితే ఆమె మాత్రం ఐశ్వర్యా రాయ్ కాదు. ఆయన పాత స్నేహితురాలు హృషితా భట్. కరీనా కపూర్ సైఫ్ తో జోడీ కట్టగానే షాహీద్ కపూర్ చేయి పట్టుకోవడానికి ముందుకు వచ్చింది. పాత గాళ్ ఫ్రెండ్ హృషితా భట్ తిరిగి ప్రేమాయణం కొనసాగించడానికి రెడీ అంది. కరీనా కపూర్ ఇచ్చిన షాక్ కు హృషితా ను వద్దనే సాహసం చేయలేడు కదా షాహిద్ ఇపుడు.


Click it and Unblock the Notifications











