బాలీవుడ్ బాధ్షా ఓ సందర్బంలో తనను తాను (డిల్లీ వాలా) డిల్లీకి సంభందించిన వ్యక్తి నని చెప్పుకున్నాడు. ఇది శివసేన వారికి రుచించటం లేదు. వారి పత్రిక సమ్నాలో బాల్ ధాకరే మండిపడుతూ ఎడిటోరియల్ రాసాడు. దానిలో షారూఖ్ ని ముంబయి బద్షా(కింగ్) చేసింది. ఇవాళ అతను తల్లి పాలు త్రాగుతూ రొమ్మునే కొరికినట్లు ఇలా స్టేట్ మెంట్స్ ఇవ్వటం ఎంతవరకూ సమంజసం అంటూ విరుచుకు పడ్డాడు. తనను తాను డిల్లీ వాడిగా భావించేటప్పుడు ముంబయి ఎందుకు రావాలి...ఇక్కడ ఇంకా పనేంటి అని తీవ్ర స్ధాయిలో ద్వజమెత్తారు. కొద్ది రోజుల క్రిందటే రాజ్ ధాకరే హిందీ భాష మాట్లాడటంపై జయా బచ్చన్ చేసిన వ్యాఖ్యలను కించపరిచేవిగా పరిగణించి అమితాబ్ సినిమాలపై బ్యాన్ పెట్టడం గమనార్హం.