తోటి ఖాన్‌లపై షారుఖ్ చిన్న చూపు!
బాలీవుడ్ ఖాన్ త్రయం షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్. బాలీవుడ్ టాప్ స్టార్లయిన వీళ్లకి ఒకరంటే ఒకరికి అస్సలు పడదు. అనే సందర్భాల్లో వీళ్ల మధ్య విబేధాలు బయట పడ్డాయి కూడా. అయితే ఈ మధ్య వీరి మధ్య ఉన్న గొడవలు తగ్గుముఖం పట్టాయి అనే తరుణంలో...మరోసారి కాస్త వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు షారుఖ్.
షారుక్‌ఖాన్ ప్రధాన పాత్రలో అనుభవ్‌సిన్హా అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్న సైన్స్ ఫిక్షన్ 'రా వన్". కరీనాకపూర్ కథానాయిక. రెడ్ చిల్లీస్ పతాకంపై ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థతో కలిసి షారుక్‌ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ సినిమా ఆడియో వేడుక ఇటీవల ముంబైలో జరిగింది. ఈ సందర్భంగా షారుఖ్‌ఖాన్ మాట్లాడుతూ' ఇందులో నటించిన కరీనా ఏ విషయంలోనూ నాకోసం ప్రత్యేకంగా సమయం కేటాయించలేదు. ఎందుకంటే ఈ మధ్య విరామం లేకుండా చిన్న చిన్న ఖాన్‌లతోనటిస్తూ బిజీగా వుంటోంది. అందుకే ఆమె నా కోసం ప్రత్యేకంగా సమయం కెటాయించలేకపోయింది" అంటూ చమత్కరించాడు.
షారుఖ్ చేసిన ఈ వ్యాఖ్యలు చమత్కారంలా కనిపించినా...తన తోటి ఖాన్ ల పట్ల షారుఖ్ ఖాన్ కు ఉన్న అసలు ఉద్దేశ్యం, చిన్న చూపు బహిర్గతం అయిందని సల్మాన్, అమీర్ అభిమానులు మండి పడుతున్నారు.


Click it and Unblock the Notifications











