అల్లు అర్జున్ సాంగ్ కు షారుక్ ఖాన్ డాన్స్ అదుర్స్
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ఆర్య 2 సినిమా కోసం దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన 'రింగా..రింగా..' సాంగ్ ఎంత హిట్టయిందో అందరికీ తెలిసిందే. ఈ పాటకు షారుఖ్ ఖాన్ శ్రేయ తో కలిసి డాన్సు చేసాడు. ఈ సంఘటన ఐపియల్ 4 ప్రారంభ వేడుకల్లో చోటు చేసుకుంది.ప్రపంచం మొత్తం చూస్తున్న ఈ వేడుకలో ఓ తెలుగు పాటకు షారుక్ ఖాన్ లాంటి పెద్ద స్టార్ డాన్సు చేయడం విశేషంగా అంతా చెప్పుకుంటున్నారు. ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం బద్రీనాధ్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.బద్రీనాధ్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ మొన్న ఉగాది రోజున విడుదలై అంతటా క్రేజ్ తెచచుకున్నాయి. ఇక ఈ చిత్రం తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయటానకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.


Click it and Unblock the Notifications











