»   »  ఫోటోలు : ప్రియాంక తండ్రి అంత్యక్రియల్లో సెలబ్రిటీలు

ఫోటోలు : ప్రియాంక తండ్రి అంత్యక్రియల్లో సెలబ్రిటీలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా తండ్రి అశోక్ చోప్రా సోమవారం మధ్యాహ్నం మృతి చెందిన సంగతి తెలిసిందే. కొన్నేళ్లుగా క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న ఆయన ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. అశోక్ చోప్రా అంత్యక్రియలు సోమవారం సాయంత్రం ముంబైలోని ఓశివర స్మశాన వాటికలో జరిగాయి.

ఈ కార్యక్రమానికి పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు. షారుక్ ఖాన్, షాహిద్ కపూర్, దీపిక పడుకొనె, రణబీర్ కపూర్, పునీత్ మల్హోత్రా, అనురాగ్ బసు, రమేష్ తౌరానీ, పరిణితి చోప్రా, కరణ్ జోహార్, మాధుర్ బండార్కర్, రణవీర్ సింగ్, అర్జున్ బజ్వా తదితరులు హాజరయ్యారు.

ప్రియాంక చోప్రా క్లోజ్ ఫ్రెండ్స్ అయిన హృతిక్ రోషన్, షాహిద్ కపూర్.... అశోక్ చోప్రా మరణ విషయం తెలిసిన వెంటనే కోకిలాబెన్ ఆసుపత్రికి చేరుకున్నారు. ప్రియాంక చోప్రాకు, ఆమె కుటుంబానికి సపోర్టుగా నిలిచారు. ఆసుపత్రి నుంచి అశోక్ చోప్రా భౌతిక కాయాన్ని ఇంటికి తరలించారు.

అశోక్ చోప్రా ఇండియన్ ఆర్మీలో డాక్టర్. 2008 నుంచి ఆయన క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్నారు. క్యాన్సర్ వ్యాధి చివరి దశకు చేరుకుని ఆరోగ్యం విషమించడంతో 18 రోజుల క్రితం ఆయన ఆసుపత్రిలో చేరారు. సోమవారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు.


ప్రియాంక చోప్రా తండ్రి అంత్య క్రియల్లో షారుక్ ఖాన్ పాల్గొన్నారు. భుజానికి శస్త్ర చికిత్స కారణంగా కొంత కాలంగా ఇంట్లో రెస్టు తీసుకుంటున్న షారుక్, ఈ విషయం తెలిసిన వెంటనే షాకయ్యారు.


ప్రముఖ నటి, ప్రింయాక స్నేహితురాలు దీపిక పడుకొనె దహన క్రియల్లో పాల్గొని సంతాపం ప్రకటించారు.


అశోక్ చోప్రా మృతి విషయం తెలియగానే షాహిద్ కపూర్ కోకిలా బెన్ ఆసుపత్రికి చేరుకున్నారు.


ప్రియాంక చోప్రాతో కలిసి పలు చిత్రాల్లో నటించిన రణవీర్ కపూర్ ప్రియాంకను ఓదార్చారు.


ప్రియాంక చోప్రా కజిన్ పరిణితి చోప్రా... అశోక్ చోప్రా అంత్యక్రియల్లో పాల్గొన్న దృశ్యం


ప్రియాంక చోప్రాతో కలిసి బర్ఫీ చిత్రంలో నటించని రణబీర్ కపూర్ కూడా అశోక్ చోప్రా అంత్య క్రియలకు హాజరయ్యారు.


రణబీర్ కపూర్, కరణ్ జోహార్, దీపిక పడుకొనె అశోక్ చోప్రా అంత్యక్రియల్లో పాల్గొన్న దృశ్యం


ప్రియాంక చోప్రా సోదరుడు సిద్ధార్థ చోప్రాను ఓదారుస్తున్న షారుక్ ఖాన్


ప్రియాంక చోప్రా తండ్రి అంత్యక్రియలకు హాజరైన కరణ్ జోహార్ ఆమెను ఓదార్చారు.


అశోక్ చోప్రా అంత్యక్రియల్లో ప్రియాంక, పరిణీతిలతో కలిసి షారుక్


అశోక్ చోప్రా అంత్యక్రియలు ముంబైలోని ఓశివరా స్మశాన వాటికలో సోమవారం సాయంత్రం జరిగాయి.


శోక సముద్రంలో తండ్రి మృతదేహం వద్ద ప్రియాంక చోప్రా....


ప్రియాంక చోప్రాతో కలిసి ఫ్యాషన్ చిత్రంలో పని చేసిన దర్శకుడు మాధుర్ బండార్కర్ అశోక్ చోప్రా అంత్యక్రియలకు హాజరయ్యాడు.


బాలీవుడ్ డిజైనర్ మనీష్ మల్హోత్రా...కూడా ప్రియాంక చోప్రా తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యారు.


ప్రియాంక చోప్రా తండ్రి దహన క్రియలకు సంజయ్ చోప్రా కూడా హాజరయ్యారు.


ప్రియాంక చోప్రా తండ్రి దహన క్రియలకు సంజయ్ చోప్రా కూడా హాజరయ్యారు.


ఫ్యాషన్ చిత్రంలో ప్రియాంక చోప్రాతో కలిసి నటించిన అర్జున్ భజ్వా...అశోక్ చోప్రా అంత్యక్రియల వద్ద దర్శనం ఇచ్చారు.


అశోక్ చోప్రా అంత్యర్రియలకు ఆశీష్ చౌదరి కూడా హాజరయ్యారు.


భుజానికి శస్త్ర చికిత్స జరుగడంతో షారుక్ ఖాన్ చేతికి కట్టుతోనే హాజయ్యారు. దీన్ని బట్టి ప్రియాంకతో ఆయనకు ఉన్న సాన్నిహిత్యం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.


బాలీవుడ్లో ప్రియాంక చోప్రా సన్నిహితులంతా అశోక్ చోప్రా అంత్యక్రియల కార్యక్రమానికి హాజరయ్యారు.


తండ్రి మరణంతో ప్రియాంక చోప్రా తీవ్రంగా కృంగిపోయి కంటతడి పెట్టింది.

English summary
Bollywood actress Priyanka Chopra's father Ashok Chopra passed away on Monday afternoon. He was suffering from cancer and was ill from a very long time. Ashok Chopra's cremation was held on Monday evening at Oshiwara crematorium in Mumbai. The last rites of Ashok Chopra took place around 5.30 p.m.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu