Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఎపిసోడ్ కి రెండున్నర కోట్లు వసూలు చేస్తున్న స్టార్ హీరో
త్వరలో షారుఖ్ సాబ్ 'జోర్ కా జట్కా" అనే రియాలిటీ షో నిర్వహించడానికి రెడీ అవుతున్నాడు. ఇందునిమిత్తం ఆయన వసూలు చేస్తున్న రెమ్యునేషన్ వింటే కళ్ళు తిరుగుతాయి. ఎపిసోడ్ కి రెండున్నర కోట్లు. మొత్తం 16 ఎపిసోడ్స్ కి కానూ ఆయన 40 కోట్లు వసూలు చేస్తారు. ఇంత మొత్తంలో టీవీ షోకి రెమ్యునేషన్ తీసుకోవడం ఇదే రికార్డ్. ఈ సందర్భంగా షూరూఖ్ మాట్లాడుతూ...'మై నేమ్ ఈజ్ ఖాన్' అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు. దాంతో కొంత డిప్రెషన్ కి లోనయ్యాను. మరో ప్రక్క ఈ మధ్య నాకు తగిలిన ఓ గాయం వల్ల అనారోగ్యం పాలయ్యాను. ఈ నేపథ్యంలో నాకు లభించిన టీవీ అవకాశం నన్నంతో ఆనందంలో ముంచేసింది అన్నారు. 'వైప్ అవుట్" అన్న విదేశీ టీవీ కార్యక్రమానికి మన దేశ పరిస్థితుల కనుగుణంగా 'జోర్ కా జట్కా"ని రూపొందించారు. 28 మంది అభ్యర్థులు పాల్గొనే ఆసక్తిదాయక కార్యక్రమం ఇది. 'ఎదురయ్యే అడ్డంకుల్ని అధిగమిస్తూ పాల్గొనే వారు చేసే విన్యాసాలూ వగైరా చూపరుల్ని ఉత్కంఠపరుస్తాయి. వినోద ప్రధానమైన ఈ షో 'మస్తీ కా మట్కా..ఫన్ కా ఝట్కా.." ఎంటర్ టైన్ మెంట్ గా 'ఛస్కా" అంటాడు ఖాన్.