ఆ స్టార్ హీరో తొలి సంపాదన కేవలం రూ.50
బాలీవుడ్ బాద్‌షా షారుక్‌ఖాన్ తొలి సంపాదన కేవలం యాభై రూపాయలు. ఓ సంగీత కచేరీ కార్యక్రమంలో గేట్ బాయ్ గా పనిచేయడం ద్వారా ఆ మొత్తాన్ని ఆర్జించారు. ప్రముఖ గజల్ గాయకుడు పంకజ్ ఉధాస్ నిర్వహించిన కార్యక్రమంలో షారుక్..గేటు దగ్గర ఉండి వచ్చిన ప్రేక్షకులకు వారి సీట్లను చూపించడం వంటి పనులు చేశారు. అనంతరం ఆ రూ.50తో ప్రేమకు చిహ్నమైన తాజ్ మహల్ ను సందర్శించారు. ఢిల్లీలో పంకజ్ ఉధాస్ సంగీత కచేరీలో పనిచేయడం ద్వారా రూ.50 సంపాదించాను. అదే నా తొలి సంపాదన. ఆ డబ్బులతో ట్రైన్ లో ఆగ్రా వెళ్లి తాజ్ మహల్ చూశాను అని షారుక్ ట్విట్టర్ లో రాశారు. స్టార్స్ అంతా ఇలా ట్విట్టర్ లో తమ అభిమానులుతో అనుభవాలు, అనుభూతులు పంచుకుంటున్నారు. ప్రస్తుతం షారూఖ్ ఖాన్ రా..వన్ అనే సైన్స్ ఫిక్షన్ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఆయన నటించిన మై నేమ్ ఈజ్ ఖాన్ మంచి వసూళ్ళు సాధించి హిట్ గా నిలిచింది.


Click it and Unblock the Notifications











