»   » స్టార్స్ సందడి దాదా సాహెబ్ ఫాల్కే ఫౌండేషన్ అవార్డ్స్ (ఫోటోస్)

స్టార్స్ సందడి దాదా సాహెబ్ ఫాల్కే ఫౌండేషన్ అవార్డ్స్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: ‘దాదా సాహెబ్ ఫాల్కే ఫౌండేషన్' అవార్డుల ప్రధానోత్సవం ఇటీవల ముంబైలో గ్రాండ్ గా జరిగింది. బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్, సీనియర్ నటి జయప్రద, నటి హుమా ఖురేషి, రాజ్ కుమార్ రావు, జాకీ భగ్నానీ, టైగర్ ష్రాఫ్ తదితరులు అవార్డులు అందుకున్నారు.

నటి జయప్రదను ‘దాదా సాహెబ్ ఫాల్కే ఫౌండేషన్' తరుపున ప్రతిష్టాత్మక ‘కళాశ్రీ' అవార్డుతో సత్కరించారు. సినీ రంగానికి ఆమె చేసిన సేవలకు గుర్తింపుగానూ ఈ అవార్డు అందజేసారు. ఇంత గొప్ప అవార్డు అందుకోవడం జయప్రద సంతోషం వ్యక్తం చేసారు.

‘హ్యాపీ న్యూ ఇయర్' చిత్రంలో పెర్ఫార్మెన్స్ కుగాను షారుక్ ఖాన్ అవార్డు అందుకున్నారు. డేడ్ ఇష్కియా చిత్రంలో నటనకుగాను హుమా ఖురేషి అవార్డు అందుకున్నారు. సిటీ లైట్స్ చిత్రంలో పెర్ఫార్మెన్స్ కుగాను రాజ్ కుమార్ రావు, యంగిస్థాన్ చిత్రంలో నటనకుగాను జాకీ భగ్నానీ, హీరోపంటి చిత్రంలో పెర్ఫార్మెన్సుకుగాను టైగర్ ష్రాఫ్ అవార్డులు అందుకున్నారు.

స్లైడ్ షోలో ఫోటోలు....

షారుక్ ఖాన్
  

షారుక్ ఖాన్

హ్యాపీ న్యూ ఇయర్ చిత్రంలో పెర్ఫార్మెన్స్ కు గాను బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ దాదా సాహెబ్ ఫాల్కే ఫౌండేషన్ తరుపున అవార్డు అందుకున్నారు.

షారుక్ ఎంటర్టెన్మెంట్
  

షారుక్ ఎంటర్టెన్మెంట్

అవార్డుల కార్యక్రమం సందర్బంగా సభికులను ఆకట్టుకునేలా స్పీచ్ ఇవ్వడంతో పాటు డాన్స్ చేసి అలరించారు షారుక్.

జయప్రద
  

జయప్రద

దాదా సాహెబ్ ఫాల్కే ఫౌండేషన్ వారు జయప్రదను ప్రతిష్టాత్మక కళాశ్రీ అవార్డుతో సత్కరించారు.

హుమా ఖురేషి
  

హుమా ఖురేషి

డేడ్ ఇష్కియా చిత్రంలో నటనకుగాను హుమా ఖురేషి అవార్డు అందుకున్నారు. ఈ అవార్డు అందుకోవడం ఎంతో గర్వంగా ఉందని హుమా ఖురేషి పేర్కొన్నారు.

రాజ్ కుమార్ రావు
  

రాజ్ కుమార్ రావు

సిటీ లైట్స్ చిత్రంలో నటనకు గాను రాజ్ కుమార్ రావు దాదా సాహెబ్ ఫాల్కే ఫౌండేషన్ అవార్డు అందుకున్నారు.

జాకీ భగ్నానీ
  

జాకీ భగ్నానీ

యంగిస్థాన్ చిత్రంలో నటనకుగాను జాకీ భగ్నానీకి అవార్డు దక్కింది.

టైగర్ ష్రాఫ్
  

టైగర్ ష్రాఫ్

తొలి చిత్రం ‘హీరోపంటి' చిత్రంలో ఆకట్టుకునే పెర్ఫార్మెన్స్ ఇచ్చినందుకుగాను టైగర్ ష్రాఫ్ అవార్డు అందుకున్నారు.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu