వైన్ వయస్సు పెరుగుతున్న కొద్దీ కిక్కు పెరిగి నిషా పెరుగుతుంది. అలాగే షారూఖ్ కూడా వయస్సు పెర్గుతున్న కొద్దీ మరింత టేస్టీగా తయారవుతున్నాడు...అంటోంది వైభవ్ మర్చంట్. షారూఖ్ లేటెస్ట్ సినిమా రబ్ నె బనా దె జోడి కి కొరియాగ్రఫి చేసిన ఆమె అలా పొగడ్తలలో ముంచెత్తుతోంది. ఆమె వీర్ జారా(2004) చిత్రం తర్వాత ఇప్పుడే మళ్ళీ ఇప్పుడే షారూఖ్ సినిమాకు పనిచేసింది. అప్పడు షారూఖ్ వయస్సు ముఫ్ఫై తొమ్మిది. ఈ నాలుగేళ్ళలో చాలా మార్పు వచ్చింది.అప్పటికన్నా ఇప్పుడు అధ్బుతంగా స్టెప్స్ వేస్తున్నాడు .నిజం చెప్పాలంటే అతని ప్రక్కన నాకు డాన్స్ చేస్తూ నటించాలనిపిస్తుంది.అలాగే ఎప్పుడూ కొత్త విషయాలు తెల్సుకోవటంలో ముందుఉంటాడు..అందుకే అంతలా ఆకర్షిస్తాడు అందర్నీ..అంటోంది.