రవితేజలా షారుఖ్... జింతాతా తా!
రవితేజ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'విక్రమార్కుడు' చిత్రం అప్పట్లో భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈచిత్రం చూసిన ఎవరికైనా రవితేజ అమ్మాయిల ముందు వేసే 'జింతాతా' బీట్ తప్పకుండా గుర్తుండి పోతుంది. రవితేజ మాస్ మేనరిజం కూడా తోడవటంతో ఆ బీట్ తెగ పాపులర్ అయింది.
తాజాగా 'విక్రమార్కుడు' చిత్రాన్ని బాలీవుడ్‌లో 'రౌడీ రాథోర్' పేరుతో రీమేక్ చేస్తున్న దర్శకుడు ప్రభుదేవా....విక్రమార్కుడు చిత్రాన్ని సీన్ టు సీన్, డైలాగ్ టు డైలాగ్ మక్కికి మక్కి దించేస్తున్నాడు. కోల్‌కతా టీం ఐపీఎల్-5 కప్ గెలిచిన నేపథ్యంలో ఇటీవల జరిగిన సెలబ్రేషన్స్‌లో 'రౌడీ రాథోర్' టీం కూడా పాల్గొంది.
ఈ సందర్భంగా 'జింతాతా తా' బీట్ చూసి మనసు పడ్డ షారుఖ్.....దాన్ని తనకూ నేర్పించమని అడిగాడు. షారుఖ్ అడిగిందే ఆలస్యం 'జింతాతా తా' బీట్ నేర్పించాడు ప్రభుదేవా. మొత్తానికి రవితేజ వేసిన బీట్ పుణ్యమా అని షారుఖ్ దృష్టిలో పడ్డ ప్రభుదేవా...భవిష్యత్‌లో షారుఖ్ తనకు ఏదో ఒక అవకాశం ఇస్తాడనే ఆశతో ఉన్నాడట.
ప్రభుదేవా దర్శకత్వంలో అక్షయ్ కుమార్ హీరోగా సంజయ్ లీలా భన్సాలీ 'రౌడీ రాథోర్' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పోకిరీని 'వాంటెడ్'గా మార్చి బాలీవుడ్ లో హిట్ కొట్టిన ప్రభుదేవాపై నమ్మకంతో ఈ ప్రాజెక్టుని అప్పచెప్పినట్లు చెప్తున్నారు. సోనాక్షి సిన్హా ఈ చిత్రంలో అనూష్క పాత్రను చేసింది. ఈ చిత్రం పక్కా మాస్ మశాలా గా రూపొందించటానికి ప్రభుదేవా చాలా రోజులు పాటు స్క్రిప్టు పై కసరత్తులు చేసి తెరకెక్కించారు.


Click it and Unblock the Notifications











