బ్యాడ్‌బాయ్‌ని కానంటున్న సూపర్ స్టార్
ప్రతి మనిషిలోనూ మంచి-చెడు రెండూ ఉంటాయి. ఎప్పుడూ మంచిగా ప్రవర్తించే పాత్రలు పోషిస్తూనే ఉంటాం కదా. ఈసారి భిన్నంగా డాన్2 లో బ్యాడ్‌బాయ్ పాత్ర చేశాను. అయితే నేను వ్యక్తిగతంగా బ్యాడ్ కాదు. ఈ సినిమాలో క్యారెక్టర్‌ని అందరూ ఫాలో కావాలని మాత్రం నేను చెప్పను అంటున్నారు షారూఖ్ ఖాన్. బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ తాజా చిత్రం డాన్ 2 త్వరలో విడుదల కానుంది. ఈ నేపధ్యంలో బంజారాహిల్స్ రోడ్ నెంబర్-2లోని సినీమ్యాక్స్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని చిత్రం (తెలుగు వెర్షన్) ఆడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు.
ఇక నా తొలి డాన్ సినిమాకు సీక్వెలాగా రూపొందిన ఈ సినిమా గురించి చెప్పాలంటే...ఇది ఒక మోస్ట్ స్టయిలిష్ మూవీ. మన దేశంతో పాటు జర్మనీ, మలేషియా తదితర దేశాల్లోనూ షూటింగ్ చేశాం. నాకు బా గా నచ్చిన అద్భుతమైన కార్ ఛేజ్‌లు ఇందులో ఉన్నాయి. యాక్షన్ సన్నివేశాలను సహజంగా చిత్రీకరించేందుకు జర్మన్ ఫైట్‌మాస్టర్‌ల ను వినియోగించాం. డిసెంబరు 23న ఓ దుష్టుడు (డాన్-2) మీ ముందుకు వస్తున్నాడు. తెలుగు, తమిళ భాషలతో పాటు మీరు మరింతగా ఆస్వాదించాలనే ఈ సినిమా 3డి వెర్షన్ కూడా విడుదల చేస్తున్నాం అన్నారు. ఇక రీసెంట్ గా షారూఖ్ ఖాన్ నటించిన రావన్ చిత్రం విడుదలైంది. తెలుగులో సైతం భారీగా విడుదలైన ఈ చిత్రం ప్లాఫ్ టాక్ తెచ్చుకుంది.


Click it and Unblock the Notifications











