రైల్వే స్టేషన్లో ఆస్తులు ధ్వంసం: షారుక్ ఖాన్ మీద కేసు నమోదు!

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ మీద రాజస్థాన్ లో కేసు నమోదైంది. రాజస్థాన్ లోని కోటా రైల్వే స్టేషన్లో ఆస్తులు ధ్వంసం అయిన ఇష్యూలో రైల్వే పోలీసులు ఈ కేసు నమోదు చేసారు.

By Bojja Kumar

కోటా : బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ మీద రాజస్థాన్ లో కేసు నమోదైంది. రాజస్థాన్ లోని కోటా రైల్వే స్టేషన్లో ఆస్తులు ధ్వంసం అయిన ఇష్యూలో రైల్వే పోలీసులు ఈ కేసు నమోదు చేసారు. షారుక్ స్వయంగా ఆస్తుల ధ్వంసానికి పాల్పడక పోయినా.... ఆయన వల్లే ఇదంతా జరిగింది అనేది ప్రధాన ఆరోపణ.

షారుక్ ఖాన్ తన తాజా చిత్రం 'రాయీస్' ప్రమోషన్లో భాగంగా ఆ మధ్య రైల్ యాత్ర నిర్వహించారు. ఇందులో భాగంగా రాజస్థాన్ లోని కోటా రైల్వే స్టేషన్ కు చేరుకున్న ఆయన్ను చూసేందుకు చాలా మంది అభిమానులు తరలివచ్చారు. ఈ క్రమంలో అక్కడ వ్యాపారం చేసుకుంటున్న వర్తకుల ఆస్తులు ధ్వంసం కావడంతో పాటు పలువురు గాయపడ్డారు.

Shahrukh Khan booked for rioting, damaging railway property in Kota

జనవరి 23న క్రాంతి రాజ్ ధాని ఎక్స్ ప్రెస్ లో షారుక్ ఖాన్ కోటా రైల్వేస్టేషన్ కు వచ్చారని, బోగి వద్ద ఆగిన ఆయన్ను చూసేందుకు భారీగా అభిమానులు తరలి వచ్చారని, అభిమానుల్లోకి షారుక్ ఏదో విసరడంతో దాన్ని తీసుకోవడానికి వారు ఎగబడ్డారని, దీంతో స్టేషన్లో విధ్వంసం ఏర్పడిందని, తనకు కూడా తీవ్రమైన గాయాలయ్యాయని, విక్రమ్ సింగ్ అనే వ్యాపారి ఆరోపించారు.

విక్రమ్ సింగ్ ఫిర్యాదు మేరకు షారుక్ మీద కేసు పెట్టాలని రైల్వే కోర్టు సూచించడంతో జీఆర్పీ సిబ్బంది కేసు నమోదు చేసారు. అతడిపై ఐపీసీ 427, 120(బి), 147, 149 సెక్షన్లతో పాటు, రైల్వే చట్టంలోని 145, 146, 3 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X