»   » అర్ధరాత్రి స్టార్ హీరో ఇంటిముందు ఫ్యాన్స్ సందడి (ఫోటోస్)

అర్ధరాత్రి స్టార్ హీరో ఇంటిముందు ఫ్యాన్స్ సందడి (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ సోమవారం 50వ వసంతంలోకి అడుగు పెట్టారు. షారుక్ పుట్టినరోజును పురస్కరించుకుని అభిమానులు భారీగా ఆదివారం అర్ధరాత్రే ముంబైలోని ఆయన నివాసం ‘మన్నత్' వద్దకు చేరుకున్నారు. వందలాది మంది అభిమానులు మన్నత్ ముందు గుమికూడి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

తన కోసం భారీగా వచ్చన అభిమానులను ఏ మాత్రం నిరాశ పరచకుండా ఇంటి బయటకు వారి ముందుకు వచ్చి వారి శుభాకాంక్షలను స్వీకరించారు షారుక్. అభిమానులు తన కోసం ఇక్కడి వరకు వచ్చి విష్ చేయడాన్ని ఎప్పటికీ మరిచి పోలేనని షారుక్ ఖాన్ చెప్పుకొచ్చారు.

అర్ధరాత్రి 12 గంటల తర్వాత షారక్ తన సభ్యులు భార్య గౌరీ ఖాన్, పిల్లలు ఆర్యన్ ఖాన్, సుహానా ఖాన్, అబ్ రామ్ మధ్య కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుక సెలబ్రేట్ చేసుకున్నారు. 50 ఏళ్ల వయసున్న షారుక్ త్వరలో రాబోతున్న తన సినిమా ‘ఫ్యాన్'లో పాతికేళ్ల కుర్రాడిలా కనిపించబోతుండటం విశేషం.

షారుక్ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో...

ఫ్యామిలీతో షారుక్

ఫ్యామిలీతో షారుక్

తన కుటుంబ సభ్యుల మధ్య షారుక్ తన 50వ పుట్టినరోజు వేడుక జరుపుకున్నారు.

అభిమానులకు అభివాదం

అభిమానులకు అభివాదం

తనను చూసేందుకు తన ఇంటి ముందు గుమికూడిన అభిమానులకు అభివాదం చేస్తున్న షారుక్.

ప్రతి ఏడాది

ప్రతి ఏడాది

ప్రతి ఏడాది అభిమానులు ఆయన పుట్టినరోజు నాడు ఆయన నివాసానికి చేరుకుని సందడి చేయడం సాధారణమే అయినా...ఈ సారి షారుక్ 50వ పుట్టినరోజు కావడంతో సందడి మరింత ఎక్కువైంది.

ఫ్యాన్స్

ఫ్యాన్స్

తనకు బర్త్ డే విషెస్ చెప్పిన అభిమానులకు ఫ్లయింగ్ కిస్ ఇస్తున్న షారుక్ ఖాన్.

కింగ్ ఖాన్

కింగ్ ఖాన్

బాలీవుడ్లో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో షారుక్ ఖాన్ ఒకరు. ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా ఆయన స్టార్ హీరోగా ఎదిగారు.

షారుక్ ఫ్యాన్స్

షారుక్ ఫ్యాన్స్

షారుక్ ఖాన్ నివాసం ముందు అభిమానుల సందడి.

సూపర్ స్టార్ ఎస్ఆర్‌కె

సూపర్ స్టార్ ఎస్ఆర్‌కె

షారుక్ 50వ పుట్టినరోజు సందర్భంగా అభిమానులతో పాటు..సల్మాన్ ఖాన్, ప్రీతి జింతా, దీపిక పదుకోన్, కాజోల్, అనుష్క శర్మ, కత్రినా కైఫ్, వివేక్ ఒబెరాయ్, కరణ్ జోహార్, జెనీలియా, ఫర్హాన్ అక్తర్, సోను సూద్ తదితరులు శుభాకాంక్షలు తెలియజేసారు.

షారుక్ 50వ పుట్టినరోజు

షారుక్ 50వ పుట్టినరోజు

షారుక్ ఖాన్ తన 50వ పుట్టినరోజును స్పెషల్ గా జరుపుకున్నారు. అభిమానులు, బాలీవుడ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ తో గడిపారు. మీడియాను కూడా కలవనున్నారు.

మరిచిపోలేని రోజు..

మరిచిపోలేని రోజు..

50వ పుట్టినరోజు తన జీవితంలో మరిచిపోలేని రోజని షారుక్ ఖాన్ చెప్పుకొచ్చారు.

English summary
It's Superstar Shahrukh Khan's 50th birthday today (2nd November 2015). The actor rang in his 50th birthday by cutting the cake with his wife Gauri Khan and kids Aryan Khan, Suhana Khan and AbRam Khan. Shahrukh also waved at his fans, who were standing outside Mannat to catch a glimpse of their favourite star, on his special day.
Please Wait while comments are loading...