twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినిమా ప్రచారమా? ఎన్నికల ప్రచారమా?

    By Bojja Kumar
    |

    బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ తన తాజా సినిమా 'డాన్ 2' కోసం చేస్తున్న ప్రచార కార్య్రకమం ఎన్నికల యాత్రను తలపిస్తోంది. బహుషా సోనియా గాంధీ లాంటి లీడర్లు కూడా ఎన్నికల సమయంలో ఈ విధంగా ప్రచారం నిర్వహించి ఉండరు.

    హిందీతో పాటు, తెలుగు, తమిళంలో రిలీజ్ అవుతున్న ఈ సినిమా కోసం షారుఖ్ దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన నగరాలను, కాన్త పెద్ద పట్టణాలను సందర్శిస్తూ..అక్కడ మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి సినిమా విడుదల, తదితర విషయాలు వెల్లడిస్తున్నాడు. నిన్న(బుధవారం) హైదరాబాద్ వచ్చిన ఈ హీరో...ఈ రోజు అహ్మదాబాద్ లో డాన్ 2 టీంతో ప్రత్యక్షం అయ్యాడు. ప్రేక్షకులకు దగ్గరగా వెళ్లి ప్రచారం చేయడం ద్వారా సినిమాకు మీడియాలో ఎక్కువ ప్రచారం జరుగుతుందని, తద్వారా అధిక వసూళ్లు సాధించ వచ్చనేది షారుఖ్ అండ్ టీం ఆలోచనగా కనిపిస్తోంది.

    షారుఖ్, ప్రియాంక చోప్రా కథానాయకులుగా...లారాదత్త, కునాల్ కుపూర్, ఓంపురి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న డాన్ 2 సినిమాకు ఫరాన్ అక్తర్ దర్శకత్వం వహిస్తున్నారు. షారుఖ్, ఫరాన్ అక్తర్, రితేష్ సిద్వానీ సంయుక్తంగా రూ. 75 కోట్ల వ్యవయంతో ఈ చిత్రాన్ని నిర్మించారు. శంకర్ హెసన్ సంగీతం అందించగా, జాసన్ వెస్ట్ సినిమాటోగ్రఫర్ గా పని చేశారు. క్రిస్ మస్ కానుకగా డిసెంబర్ 23న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా హిందీతో పాటు తెలుగు, తమిళ వర్షన్‌లలోనూ విడుదల కాబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం ఏమిటంటే...ఈ సినిమా 3డి ఫార్మాట్ లో కూడా విడుదలవుతోంది.

    English summary
    Superstar Shahrukh Khan is travelling the country and beyond to promote his upcoming film Don 2: The King Is Back and he feels the same as being part of an election campaign. The 46-year-old actor, who rigorously promotes all his films, is currently in Ahmedabad with the 'Don 2' team.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X