twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సౌత్ దర్శకుడితో షారుఖ్ సినిమా ఖరారు

    By Bojja Kumar
    |

    చాలా కాలంగా ఆశించిన స్థాయిలో హిఃట్లు లేక గిల్టీగా ఫీలవుతున్న బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్...ఈ సారి ఎలాగైనా భారీ విజయంతో పరువు నిలబెట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు. తన తాజా సినిమా రా.వన్ పైనే షారుక్ బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. ఇప్పటి వరకు భారతీయ సినీ చరిత్రలో వచ్చిన సినిమాలన్నింటికంటే తన సినిమా విభిన్నంగా ఉంటుందని చెబుతూ తెగ ప్రచారం చేసుకున్నాడు. మరి ఆ సినిమా భవిష్యత్ ఏమిటో విడుదలైతే గానీ తెలీదు. ఆ విషయం పక్కన పెడితే....రా.వన్ తర్వాత సౌత్ దర్శకుడు మురుగదాస్‌తో సినిమా చేయాలని కన్‌ఫర్మ్ చేసుకున్నాడు ఈ హీరో.

    గజిని లాంటి భారీ బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు మురదాస్, బాలీవుడ్ కింగ్ ఖాన్ కాంబినేషన్లో సినిమా కావడంతో బాలీవుడ్ లో భారీ అంచనాలే ఉన్నాయి. తన సినిమాల్లో హీరోను విభిన్నంగా చూపించే మురగదాస్, షారుఖ్‌తో చేయబోయే సినిమా కోసం ఇప్పటి నుంచే అతన్ని తన సినిమాకు తగిన విధంగా సిద్ధం చేస్తున్నాడట. మరో రెండు నెలల్లో ఈ క్రేజీ కాంబినేషన్ సినిమా సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం షారుఖ్ నటించిన రా.వన్, మురగదాస్ దర్శకత్వం వహించిన 7ఎఎం అరివు(తెలుగులో సెవెన్త్ సెన్స్) ఒకే సారి విడుదలవుతున్నాయి. ఈ రెండు సినిమాలు భారీ హిట్టయితే షారుఖ్-మురగదాస్ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగి పోవడం ఖాయం.

    English summary
    Bollywood actor Shahrukh Khan, who is eagerly awaiting for the release of his multilingual Ra.One, has finally confirmed that he will be working with ace director AR Murugadoss.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X