హీరోపై క్రేజ్ తో ఇంట్లోంచి పారిపోయి అమ్మాయిలు....
ముంబై: బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్‌ను చూడాలనే ఆశతో హర్యానా నుంచి పారిపోయి ముంబయి చేరుకున్న 17 ఏళ్ల వయసున్న ఇద్దరు బాలికలు చివరికి రైల్వే పోలీసులకు చిక్కారు. ఢిల్లీ నుంచి రైలులో ముంబయి చేరుకునేందుకు వచ్చిన వీరిని దహాణు స్టేషనులో పట్టుకున్నారు. సినిమాల్లో చూపించే సంఘటనలను తలిపించిన ఈ కథనం అందరిలో ఆసక్తిని రేకిత్తించింది.
వివిరాల్లోకి వెళితే... హర్యానాకు చెందిన సోనియా, ఆమె స్నేహితురాలు రోహిణి టీవీలో వచ్చే సబ్బుల ప్రకటనలను ఎంతో ఆసక్తితో చూసేవారు. షారుక్ నటించిన జత్ తక్ హై జాన్ ప్రకటనను చూసి ఆయన్ను కలుసుకోవాలనుకున్నారు. గురువారం ఇంట్లో రూ.15,000 అపహరించి ఢిల్లీ చేరుకున్నారు.
ముంబయి సెంట్రల్‌కు టిక్కెట్లు కొనుగోలు చేసి పశ్చిమ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరారు. తన కుమార్తె కన్పించడం లేదని సోనియా తండ్రి హిస్సార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహారాష్ట్రలోని దహాణులో రైలు ఆగినప్పుడు బోగీలో ఒంటరిగా ఉన్న ఈ ఇద్దరు బాలికలను పోలీసులు విచారించడంతో బంధువుల ఇంటికి వెళ్తున్నట్లు బుకాయించినా తర్వాత అసలు విషయం చెప్పేశారు.


Click it and Unblock the Notifications












