పవన్ కళ్యాణ్ క్షమాపణ, ఖండించిన షారుక్
హైదరాబాద్: పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది' చిత్రం తెలుగునాట భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. తర్వాత ఈ చిత్రం కన్నడలో సుదీప్ హీరోగా తెరకెక్కింది. అక్కడ కూడా ఈ చిత్రం మంచి విజయం సాధించింది. తాజాగా ఈ చిత్రాన్ని హిందీలో షారుక్ ఖాన్ హీరోగా రీమేక్ చేయబోతున్నారనే వార్తలు ఊపందుకున్నాయి. ఈ వార్తలపై షారుక్ ఖాన్ స్పందించారు. తాను ఆ సినిమా రీమేక్ చేయడం లేదని తేల్చి చెప్పారు.
గబ్బర్ సింగ్ టీంకు పవన్ కళ్యాణ్ క్షమాపణ

పవన్ కళ్యాణ్ త్వరలో ‘గబ్బర్ సింగ్-2' చిత్రంలో నటించబోతున్న సంగతి తెలిసిందే. ఎప్పుడో ఈ చిత్రం మొదలు కావాల్సి ఉండగా పవన్ కళ్యాణ్ వివిధ కారణాలతో సినిమాను వాయిదా వేస్తూ వస్తున్నారు. ఆయనకు టైం వీలు కాక కొన్ని కొన్నిరోజులు, స్టోరీ నచ్చక మరికొన్ని రోజులు, మార్పులు, చేర్పులు కోసం ఇంకొన్ని రోజులు ఇలా సినిమా దాదాపు సంవత్సరం కంటే ఎక్కువే ఆలస్యం అయింది. ఎట్టకేలకు ఈ చిత్రం నవంబర్లో సెట్స్ మీదనకు వెళ్ల బోతోంది. సినిమా ఆలస్యానికి కారణం తానే కాబట్టి గబ్బర్ సింగ్ 2 టీంను వెయిట్ చేయించినందుకు క్షమాపణలు కోరారట పవన్. అపాలజీ కోరడం ఆయన మంచి మనసుకు నిదర్శనం అంటున్నారు.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఈచిత్రాన్ని స్వయంగా పవన్ కళ్యాణే డైరెక్ట్ చేయబోతున్నాడట. ఇప్పటికే చాలా కాలం వెయిట్ చేసిన సంపత్ నంది వేరే ప్రాజెక్టుకు మూవ్ అయ్యాడని సమాచారం. అదే సమయంలో తన ఆలోచనలతో సంపత్ నంది సింక్ అవ్వక పోవడం కూడా ఇందుకు మరో కారణమని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈచిత్రానికి తానే దర్శకత్వం వహించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
పవన్ కళ్యాణ్ దర్శకత్వంలో గతంలో ‘జానీ' అనే సినిమా వచ్చింది. అయితే ఆ చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మళ్లీ దర్శకత్వం వైపు రావడం హాట్ టాపిక్ అయింది. అయితే అభిమానులు మాత్రం పవన్ కళ్యాణ్ మీద చాలా నమ్మకంతో ఉన్నారు.
'నాక్కొంచెం తిక్కుంది...' అంటూ గబ్బర్ సింగ్‌గా పవన్ కల్యాణ్ చేసిన హంగామా ప్రేక్షకుల్ని ఆకట్టుకొంది. ఇప్పుడు 'గబ్బర్ సింగ్'కి రెండో భాగం ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం బడ్జెట్ దాదాపు 70 కోట్లు అని తెలుస్తోంది. ఈరోస్ వారు ఈ చిత్రం సహ నిర్మాతగా వ్యవహరిస్తూ ఈ బడ్జెట్ ని పెట్టడానికి ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. నవంబర్ నుంచి చిత్రం షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం.


Click it and Unblock the Notifications











