»   » డిశ్చార్జయిన సూపర్‌స్టార్, నెల వరకు నో షూటింగ్

డిశ్చార్జయిన సూపర్‌స్టార్, నెల వరకు నో షూటింగ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ అభిమానులకు ఇది గుడ్ న్యూసే. ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. షారుక్ కుడి భుజానికి ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. మూడు గంటల పాటు వైద్యులు అతనికి సర్జరీ నిర్వహించారు. డిశ్చార్జ్ సమయంలో ఆయన భార్య గౌరీ ఖాన్ వెంటే ఉన్నారు.

ఈ సందర్భంగా షారుక్ ఖాన్ తన మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ద్వారా అభిమానులకు థాంక్స్ చెప్పారు. 'నా అభిమానులందరికీ కృతజ్ఞతలు. త్వరలోనే కోలుకుని మిమ్మల్ని మళ్లీ ఎంటర్టెన్ చేస్తాను' అంటూ ట్వీట్ చేసారు. వైద్యులు అతనికి నెల రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలని సూచించారు.

Shahrukh Khan

గతంలోనే షారుక్ భుజానికి గాయమైంది. తాజాగా రోహిత్ శెట్టి దర్శకత్వంలో రూపొందుతున్న 'చెన్నైఎక్స్‌ప్రెస్' చిత్రంలో యాక్షన్ సీక్వెన్స్ చేస్తుండగా షారుక్ గాయపడటంతో భుజం నొప్పి తిరగబెట్టింది. దీంతో వైద్యులు అతనికి సర్జరీ నిర్వహించక తప్పలేదు.

నెల రోజుల పాటు రెస్ట్ తీసుకున్న తర్వాత, షారుక్ ఖాన్ 'చెన్నై ఎక్స్‌‍ప్రెస్' ప్రమోషన్ కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ చిత్రంలో షారుక్‌కు జోడీగా దీపిక పడుకొనె నటించింది. ఈచిత్రం ఈ సంవత్సరం ఈద్ పండగ సందర్భంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

English summary
There is a good news for all Shahrukh fans. The actor is fine now and has been discharged from the hospital. Shahrukh underwent three hours surgery on his right shoulder at Lilavati hospital on Tuesday. His wife Gauri Khan was with him during discharge.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu