తెలుగులో షారుఖ్ ‘డాన్ 2’

By Bojja Kumar

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ నటిస్తున్న 'డాన్2" షినిమా డిసెంబర్ 23న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అదే సమయంలో ఈ సినిమాను తెలుగు, తమిళ వర్షన్‌లలో విడుదల కాబోతోంది. ఈ మేరకు త్వరలో డబ్బింగ్ కార్యక్రమాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం ఏమిటంటే...ఈ సినిమా 3డి ఫార్మాట్ లో కూడా విడుదలవుతోంది.

రియలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా గతంలో వచ్చిన 'డాన్" మూవీకి సీక్వెల్. ఫరాన్ అక్తర్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియాంక చోప్రా లీడ్ హీరోయిన్ రోల్ చేస్తుండగా, లార దత్త, సమీర రెడ్డి, కునాల్ కపూర్ ముఖ్య పాత్రల్లో కనిపించ బోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్స్ ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తున్న నేపథ్యంలో బాక్సీఫీస్ వద్ద మంచి ఫలితాలు సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు దర్శక నిర్మాతలు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X