ఒక్క సినిమాకే అంత అహంకారమా.. పాయల్ రాజ్‌పుత్ ఏం చేసిందంటే, స్టార్ హీరోపై!
సెలెబ్రిటీలు పోరాటపాటున నోరు జారితే సరిద్దుకోవడం చాలా కష్టం. ఎందుకంటే సెలెబ్రిటీల మాటలు క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. కొంతమంది హీరోయిన్లు తరచుగా నెటిజన్ల చేతిలో ట్రోలింగ్ కు గురవుతుంటారు. సంచలన హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కు కూడా ఆ బెడద తప్పడం లేదు. షారుఖ్ అభిమానులు పాయల్ రాజ్ పుత్ ని దుమ్మురేపుతున్నారు. సోషల్ మీడియా వేదికగా పాయల్ రాజ్ పుత్ చేసిన వ్యాఖ్యలు వైరల్ కావడంతో వివాదం మొదలైంది.

సగం కనబడడం లేదు
పాయల్ రాజ్ పుత్ ఇటీవల షారుఖ్ నటించిన జీరో చిత్రం చూసింది. తన అభిప్రయాన్ని తెలియజేస్తూ స్నేహితురాలితో కలసి ఫన్నీ వీడియోని పోస్ట్ చేసింది. ఈ వీడియోలో పాయల్ చేరిన వ్యాఖ్యలు షారుఖ్ అభిమానులకు కాక రేపే విధంగా ఉన్నాయి. ఈచిత్రంలో షారుఖ్ సంగం కనబడడం లేదు అంటూ వ్యాఖ్యానించింది. జీరో సినిమా బాగాలేదంటూ కామెంట్స్ చేసింది. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి.

ఒక్క సినిమాకే మరీ ఇంతగా
దీనితో షారుఖ్ అభిమానులు రెచ్చిపోతున్నారు. ఒక్క సినిమాకే ఇంత బలుపా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక నిన్ను సోషల్ మీడియాలో ఫాలో కాము అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అసలు షారుఖ్ ని విమర్శించే అర్హత నీకు ఉందా అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. తీవ్రమవుతున్న విమర్శల నేపథ్యంలో పాయల్ రాజ్ పుత్ స్పందించక తప్పలేదు.

షారుఖ్ అభిమానినే
పాయల్ రాజ్ పుత్ తన కామెంట్స్ గురించి వివరణ ఇస్తూ.. నేను కూడా షారుఖ్ అభిమానినే. నేను ఆయన నటన గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కేవలం జీరో సినిమా గురించి మాట్లాడా. జీరో సినిమా నాకు సెకండ్ హాఫ్ నచ్చలేదు. అందుకు తగ్గట్లుగానే నా అభిప్రాయాన్ని తెలియజేశా అని పాయల్ రాజ్ పుత్ పేర్కొంది. దయచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు అంటూ అభిమానులని రిక్వస్ట్ చేసింది.

ఆర్ఎక్స్ 100 చిత్రంలో
అజయ్ భూపతి తెరకెక్కించిన ఆర్ఎక్స్ 100 చిత్రంలో పాయల్ రాజ్ పుత్ కార్తికేయ సరసన నటించింది. ఈ చిత్రంలో పాయల్ రాజ్ పుత్ అందాలకు, ఆమె బోల్డ్ పెర్ఫామెన్స్ కు కుర్రకారు ఫిదా అయ్యారు. ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్ టాలీవుడ్ లో కొన్ని క్రేజీ ఆఫర్స్ అందుకుంటోంది. రవితేజ సరసన నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











