మూడో బిడ్డ విషయం కన్‌ఫర్మ్ చేసిన షారుక్
ఈ నేపథ్యంలో షారుక్ బుధవారం రాత్రి ఈ వార్తలు, వివాదాలపై తొలిసారి నోరు విప్పారు. తాను మూడో బిడ్డకు తండ్రయ్యానని వెల్లడించారు. తన తాజా సినిమా చెన్నై ఎక్స్ ప్రెస్ ఆడియో విడుదల సందర్భంగా షారుక్ ఈ విషయాన్ని వెల్లడించారు. 'ఇది నా పర్సనల్, బయటకు చెప్పకూడని విషయం...ఇది కాస్త సంతోషం, కాస్త విచారంతో కూడి ఉంది. నా బిడ్డపై దర్యాప్తు కొనసాగుతోంది' అని వెల్లడించారు.
ఇదీ అసలు విషయం...
ముంబై నుంచి అందుతున్న సమాచారం ప్రకారం షారుక్ ఖాన్-గౌరీఖాన్ దంపతులు మూడో బిడ్డకు తల్లిదండ్రులయ్యారు. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఈ విషయాన్ని ధృవీకరించారు. ఇటీవల ఈ బిడ్డ జనన ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు అందింది. ఇందులో షారుక్-గౌరీ పేరు స్పష్టంగా పేర్కొనబడి ఉందని అధికారులు వెల్లడించారు.
ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఆరోగ్యశాఖ అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ...'ముంబై కార్పొరేషన్ అధికారులకి ఒక మగ పిల్లాడికి సంబంధించిన పుట్టిన వివరాలు అందాయి. మే 27వ తేదీన ఆ బిడ్డ జన్మించాడు. ఆ పిల్లాడి తల్లిదండ్రులుగా షారుక్ ఖాన్-గౌరీ ఖాన్ పేర్లు పేర్కొనబడి ఉన్నాయి. అంధేరిలోని మస్కాని ఉమెన్స్ ఆసుపత్రి నుంచి ఈ వివరాలు అందాయి' అని వెల్లడించారు.
రెండు రోజుల క్రితం వన్ ఇండియాలో ప్రచురితమైన ఆర్టికల్‌లో....గౌరీఖాన్ మరదలు నమితా చిబ్బెర్ ఇటీవల ముంబైలోని బీచ్ క్యాండీ ఆసుపత్రిలో మగ పిల్లాడికి జన్మనిచ్చినట్లు పేర్కొన్నాము. అయితే ఆ బేబీ ఏడు నెలల వయసులోనే జన్మించడంతో ఇన్సెంటివ్ కేర్ యూనిట్లో ఉంచినట్లు పేర్కొన్నాము.
తాజాగా అందుతన్న వివరాల ప్రకారం.....నమితా చిబ్బెర్ కడుపులో సర్కోగేట్ పద్దతిలో పెరిగింది షారుక్-గౌరీ ఖాన్‌ల బిడ్డేనని తెలుస్తోంది. బిడ్డ డెలివరీ అయిన తర్వాత షారుక్-గౌరీలకు అప్పజెప్పి ఆమె తిరిగి లండన్ వెళ్లి పోయిందని తెలుస్తోంది. . సర్రోగెన్సీ పద్దతి అనగా అద్దెగర్భం. షారుక్ వీర్యకణాలు, గౌరీ అండం ద్వారా పుట్టే బిడ్డను వేరొక మహిళ గర్భంలో పెంచడం అన్నమాట.


Click it and Unblock the Notifications












