తమ హీరోకు అరుదైన గౌరవం..ఫ్యాన్స్ ఆనందం
ముంబై : ప్రముఖ బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్‌కు లండన్‌లో అరుదైన గౌరవం దక్కింది. తన నటనతోనూ, సినిమాలతోనూ ప్రపంచవ్యాప్తంగా చేసిన సేవలకు 2014కిగానూ 'గ్లోబల్ డైవర్సిటీ అవార్డు'ను రైయిన్‌బో ఫౌండేషన్ అందజేసింది. ఈ అవార్డును ఇటీవల బ్రిటన్ హౌస్ ఆఫ్ కామన్స్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కామన్స్ స్పీకర్ జాన్ బెర్కో చేతులమీదుగా షారుఖ్ అందుకున్నారు. దాంతో ఆయన అభిమానులు తమ ఆనందాన్ని ట్వీట్స్ , ఫేస్ బుక్ లో పోస్ట్ ల రూపంలోనూ తెలియచేస్తున్నారు.
''ఈ రోజు నేను మర్చిపోలేను. ఈ అవార్డు అందుకోవడం ఎంతో గర్వంగా ఉంది. దీంతో నాపై బాధ్యత మరింత పెరిగింది'' అని షారుఖ్ చెప్పారు. ''ఈ భూమీ మీద జన్మించిన అతిగొప్ప నటుల్లో షారుక్ ఒకరు'' అని అభివర్ణించారు రెయిన్‌బో ఫౌండేషన్ వ్యవస్థాపకులు కేత్ వజ్. ఇంతకుముందు ఈ అవార్డును సినీ ప్రముఖులు అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యరాయ్, జాకీచాన్ తదితరులు అందుకున్నారు.

ప్రస్తుతం షారూఖ్ ఖాన్ తాజా చిత్రం 'హ్యాపీ న్యూ ఇయర్' వస్తోంది. ఈ చిత్రం తెలుగు వెర్షన్ ని సైతం ఒకేసారి విడుదల చేయాలని నిర్ణయించుకుని, ఆ మేరకు పోస్టర్ ని కూడా రీసెంట్ గా విడుదల చేసారు. ''నా అభిమానుల కోసమే మా చిత్ర బృందం ఈ ప్రపంచ యాత్ర చేస్తుంది''అని షారుఖ్ ట్వీట్ చేశాడు. ఈ చిత్రంలో దీపికా పదుకొణె, అభిషేక్ బచ్చన్ తదితరులు నటించారు. దీపావళికి ఈ చిత్రం విడుదలకానుంది.
ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా షారుఖ్ ఖాన్ ప్రపంచాన్ని చుట్టేయాలని భావిస్తున్నాడు. తన కొత్త చిత్రం 'హ్యాపీ న్యూ ఇయర్' కోసం. ఈ సినిమా ప్రచారం కోసమే ఈ ప్రపంచ పర్యటన. ఈ యాత్రకి 'స్లామ్' అనే పేరు పెట్టారు. సెప్టెంబరు 19న ఈ టూర్ హోస్టన్‌లో మొదలై న్యూ జెర్సీ, టొరంటో, చికాగో తదితర దేశాల్లో సాగుతుంది.


Click it and Unblock the Notifications











