హైదరాబాద్‌లో షారుఖ్ ఖాన్ హల్‌చల్
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ హైదరాబాద్ లో హల్ చేశారు. తన తాజా సినిమా డాన్-2 ప్రమోషన్లో భాగంగా బుధవారం నగరానికి వచ్చిన ఆయన మాట్లాడుతూ తాను నటించిన డాన్ సినిమా కంటే డాన్-2 చాలా భాగుటుందని, కళ్లు చెదిరే యాక్షన్ సన్నివేశాలు, అద్భుతమైన సన్నివేశాలతో సినిమా అదిరిపోందన్నారు. హైదరాబాద్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని, ఈ నగరంపై ఎంతో ఇష్టం ఉనప్పటికీ తనకు ఖాళీ దొరకక ఇప్పటి వరకు రెండు సార్లు మాత్రమే రాగలిగానని షారుక్ చెప్పుకొచ్చారు. డాన్-2 సినిమా హైదరాబాదీలు ఆదరిస్తారనే నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.
షారుఖ్, ప్రియాంక చోప్రా కథానాయకులుగా...లారాదత్త, కునాల్ కుపూర్, ఓంపురి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న డాన్ 2 సినిమాకు ఫరాన్ అక్తర్ దర్శకత్వం వహిస్తున్నారు. షారుఖ్, ఫరాన్ అక్తర్, రితేష్ సిద్వానీ సంయుక్తంగా రూ. 75 కోట్ల వ్యవయంతో ఈ చిత్రాన్ని నిర్మించారు. శంకర్ హెసన్ సంగీతం అందించగా, జాసన్ వెస్ట్ సినిమాటోగ్రఫర్ గా పని చేశారు. క్రిస్ మస్ కానుకగా డిసెంబర్ 23న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా హిందీతో పాటు తెలుగు, తమిళ వర్షన్‌లలోనూ విడుదల కాబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం ఏమిటంటే...ఈ సినిమా 3డి ఫార్మాట్ లో కూడా విడుదలవుతోంది.


Click it and Unblock the Notifications











