షారూఖ్ కొత్త సినిమా తెలుగు వెర్షన్ (పోస్టర్)
ముంబై : భారీ బడ్జెట్ లతో చిత్రాలు తీస్తున్నప్పుడు రికవరీ కోసం...వేరే భాషల్లోకి డబ్బింగ్ చేసి ఒకే సారి విడుదల చేయటం స్టాటజీగా పెద్ద హీరోల చిత్రాలకు చేస్తున్నారు. ఇప్పుడు అలాంటి స్టాటజీతోనే షారూఖ్ ఖాన్ తాజా చిత్రం 'హ్యాపీ న్యూ ఇయర్' వస్తోంది. ఈ చిత్రం తెలుగు వెర్షన్ ని సైతం ఒకేసారి విడుదల చేయాలని నిర్ణయించుకుని, ఆ మేరకు పోస్టర్ ని విడుదల చేసారు.
ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా షారుఖ్ ఖాన్ ప్రపంచాన్ని చుట్టేయాలని భావిస్తున్నాడు. తన కొత్త చిత్రం 'హ్యాపీ న్యూ ఇయర్' కోసం. ఈ సినిమా ప్రచారం కోసమే ఈ ప్రపంచ పర్యటన. ఈ యాత్రకి 'స్లామ్' అనే పేరు పెట్టారు. సెప్టెంబరు 19న ఈ టూర్ హోస్టన్‌లో మొదలై న్యూ జెర్సీ, టొరంటో, చికాగో తదితర దేశాల్లో సాగుతుంది.

''నా అభిమానుల కోసమే మా చిత్ర బృందం ఈ ప్రపంచ యాత్ర చేస్తుంది''అని షారుఖ్ ట్వీట్ చేశాడు. ఈ చిత్రంలో దీపికా పదుకొణె, అభిషేక్ బచ్చన్ తదితరులు నటించారు. దీపావళికి ఈ చిత్రం విడుదలకానుంది.


Click it and Unblock the Notifications











