ఇన్ఫోసిస్ మూర్తి ఏ హీరో అభిమానో తెలుసా?
బెంగుళూరు : ఐటీ రంగం గురించి తెలిసిన వారికి ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గురించి కొత్తగ పరిచయం అక్కర్లేదు. ఇన్ఫోసిస్ లాంటి సంస్థ ప్రపంచ స్థాయి సంస్థగా ఎదగడానికి వెన్నుముఖగా నిలిచిన వ్యక్తి. కొంత కాలం క్రితం ఆయన తన విధుల నుంచి రిటైర్ అయ్యారు. తను వెళ్లిన తర్వాత సంస్థ నష్టాల బాట పట్టడంతో మళ్లీ రంగంలోకి దిగి ఇన్ఫోసిస్‌కు మళ్లీ పూర్వ వైభవం తెచ్చే పనిలో ఉన్నారు.
నారాయణ మూర్తి బిజినెస్ వ్యవహారాల సంగతి కాసేపు పక్కన పెడదాం. చాలా మందికి ఓ డౌట్. ఎప్పుడూ బిజినెస్ వ్యవహారాలతో బిజీగా ఉండే ఆయన అసలు సినిమాలు చూస్తారా? చూస్తే ఎవరి సినిమాలు ఎక్కువగా చూస్తారు? ఆయన ఏ హీరో అభిమాని? అనే సందేహాలు చాలా మందికి ఉండే ఉంటాయి.
ఇటీవలో ఓ ఇంటర్వ్యూలో ఇందుకు సంబంధించిన అంశాలపై స్పందించారు నారాయణమూర్తి. ప్రస్తుతం ఉన్న హీరోల్లో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్‌కు పెద్ద అభిమానిని అని చెప్పుకొచ్చారు నారాయణ మూర్తి. షారుక్ నటించిన 'చక్ దే ఇండియా' చిత్రంలో ఆయనకు ఎంతో నచ్చిందట.
స్లైడ్ షోలో మరిన్ని ఆసక్తికర విషయాలు...

కన్నడిగుడు అయిన నారాయణ మూర్తి ప్రముఖ కన్నడ దర్శకుడు బి రామకృష్ణయ్య పంతులు దర్శకత్వంలో వచ్చిన ‘స్కూల్ మాస్టర్' చిత్రాన్ని తొలిసారిగా చూసారట. ఈ విషయాన్ని స్వయంగా నారాయణ మూర్తి వెల్లడించారు.

ఇంటర్వ్యూలో నారాయణ మూర్తి ఇతర విషయాల గురించి చెబుతూ ‘మా నాన్న స్కూల్ టీచర్. మేము ఐదుగురు సంతానం. మా తల్లిదండ్రులకు నా చిన్నతనంలో సినిమాలు చూసే వారు కానీ, మమ్మల్ని తీసుకెళ్లేవారు కాదు. కానీ నేను తొలిసారిగా 1958లో స్కూల్ మాస్టర్ అనే సినిమా చూసాను' అని వెల్లడించారు.

‘2003 సంవత్సరంలో అమితాబ్ బచ్చన్ నటించిన బాఘ్ బన్ చిత్రం కూడా స్కూల్ మాస్టర్ చిత్రంతో పోలిక ఉంటుంది. ఈ రెండింటిలో స్కూల్ మాస్టర్ చిత్రమే చాలా ఇంపాక్టబుల్ గా ఉంటుంది. ఈ చిత్రం కథాంశం, టీచర్ చేసే త్యాగాలు నాకెంతో నచ్చాయి' అని నారాయణమూర్తి తెలిపారు.

తనకు హిందీ చిత్రాలపై ఆసక్తి పెరగడానికి కారనం తన భార్య సుధా మూర్తే కారణమని అంటున్నారు నారాయణ మూర్తి. రొమాంటిక్ చిత్రాలకంటే కామెడీ చిత్రాలనే తాను ఎక్కువ ఇష్టపడతాను అని చెప్పుకొచ్చారు నారాయణ మూర్తి

కన్నడ హీరో ఉపేంద్ర సినిమాలు అంటే ఎంతో ఇష్టమని చెబుతున్నారు నారాయణ మూర్తి. పలు సందర్భాల్లో ఉపేంద్ర చేసిన సినిమాలు చూసి పోన్ చేసి మరి అభినందనలు తెలిపారట.


Click it and Unblock the Notifications











