»   » సల్మాన్‌ను ఇఫ్తార్ పార్టీకి ఆహ్వానించిన షారుక్

సల్మాన్‌ను ఇఫ్తార్ పార్టీకి ఆహ్వానించిన షారుక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ కొన్నిరోజులుగా చాలా ఆనందంగా ఉన్నాడు. ఇటీవల షారుక్ కు మూడో సంతానంగా అబ్‌రామ్ జన్మించడంతో పాటు, చాలా కాలంగా తన కోస్టార్ సల్మాన్ ఖాన్‌తో విబేధాలు కూడా తొలిగిపోయాయి. ఈ సంతోష సమయంలో సెలబ్రేషన్స్‌కు తెరలేపారు షారుక్.

దుబాయ్‌లోని తన నివాసంలో ఫ్యామిలీ మెంబర్స్, సన్నిహితంగా ఉండే స్నేహితులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసారు షారుక్. ఆయన సన్నిహితుల నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ పార్టీకి సల్మాన్ ఖాన్‌ను కూడా ఆహ్వానించారట. ఈ వారంలోనే ఇఫ్తార్ పార్టీ ఉంటుందని స్పష్టం అవుతోంది.

షారుక్ ఖాన్-సల్మాన్ ఖాన్ కలిసి ఇటీవల ఎమ్మెల్యే బాబా సిద్ధిఖీ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ పార్టీకి హాజరు కావడంతో పాటు.....ఒకరినొకరు ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఇద్దరి మధ్య విబేధాలకు తెర పడిందనే ప్రచారం మొదలైంది.

ఆగస్టు 8వ తేదీన షారుక్ నటించిన 'చెన్నై ఎక్స్‌ప్రెస్' సినిమా విడుదల కూడా ఉండటంతో కూడా ఈ ఇఫ్తార్ విందు ఏర్పాటుకు కారణంగా తెలుస్తోంది. మరి ఈ పార్టీకి సల్మాన్ ఖాన్ హాజరవుతాడో? లేదో? అనే ఆసక్తి నెలకొంది. సల్మాన్ హాజరయితే మళ్లీ వీరి మధ్య స్నేహ సంబంధాలు పూర్తి స్థాయిలో కొనసాగుతాయని బాలీవుడ్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

షారుక్-మాధురి-సల్మాన్

షారుక్-మాధురి-సల్మాన్

బాలీవుడ్ మూవీ హమ్ తుమ్హారే హై సనమ్ సెట్స్ లో షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ కలిసి మాధురి దీక్షిత్‌తో ఫోటోలకు ఫోజులు ఇస్తున్న దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు. అప్పట్లో వీరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలకు మహా క్రేజ్ ఉండేది.

సల్మాన్ ఖాన్-షారుక్ ఖాన్

సల్మాన్ ఖాన్-షారుక్ ఖాన్

సల్మాన్ ఖాన్-షారుక్ ఖాన్ లకు సంబంధించని పాత చిత్రాన్ని ఇక్కడ చూడొచ్చు. గతంలో వీరు చాలా క్లోజ్‌గా, స్నేహితుల్లా ఉండే వారు. పలు సినిమాల్లో కలిసి నటించారు. విబేధాల కారణంగా వీరు గత కొన్నేళ్లుగా విడివిడిగా ఉంటున్నారు.

ముంబైలో జరిగిన ఇఫ్తార్ విందులో సల్మాన్, షారుక్

ముంబైలో జరిగిన ఇఫ్తార్ విందులో సల్మాన్, షారుక్

ఎమ్మెల్యే సిద్ధిఖీ ముంబైలో రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా బాలీవుడ్ స్టార్లు సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ కూడా హాజరయ్యారు. సిద్ధికీ మాట్లాడుతూ సల్మాన్-షారుక్ తన చిన్ననాటి స్నేహితులు అని వెల్లడించారు.

సల్మాన్-షారుక్ ఆలింగనం

సల్మాన్-షారుక్ ఆలింగనం

ముంబైలో ఇటీవల జరిగిన ఇఫ్తార్ విందులో సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ ఒకరినొకరు ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. చాలా కాలం తర్వాత మళ్లీ ఇద్దరూ ఇలా కలవడం పట్ల ఈ ఇద్దరు హీరోల అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఓం శాంతి ఓం సెట్స్‌లో

ఓం శాంతి ఓం సెట్స్‌లో

ఓం శాంతి ఓం షూటింగ్ సెట్స్ లో సల్మాన్ ఖాన్, సంజయ్ దత్, ఫరా ఖాన్, షారుక్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ సందడి చేసినప్పటి దృశ్యాలు ఇక్కడ చూడొచ్చు. ఆ తర్వాత కొన్ని రోజులకు కత్రినా కైఫ్ బర్త్ డే పార్టీలో సల్మాన్- షారుక్ మధ్య విభేదాలు వచ్చాయి.

English summary
Superstar Shahrukh Khan is in a very happy state these days. His son AbRam, who was born premature, has finally come to Mannat from the hospital and his old rivalry with Salman Khan has also been resolved.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu