ఆ టాప్ హీరోకి డాన్స్ రాదంటూ...హీరోయిన్ కామెంట్

By Bojja Kumar

ముంబై : బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్, మాధురి దీక్షిత్ కాంబినేషన్లో అప్పట్లో అంజామ్, కోయ్‌లా, దిల్‌తో పాగల్ హై లాంటి హిట్ చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. షారుక్‌తో ఎన్నో సినిమాల్లో ఆడిపాడిన మాధురి ఇప్పుడు అతని గురించి ఓ ఆసక్తికర విషయం బయట పెట్టింది. అతనికి డాన్స్ చేయడం సరిగా రాదని, అతను గుడ్ డాన్సర్ కాదని, అయితే ఆ విషయంలో చరిష్మా(ఆకర్షణశక్తి)తో నెగ్గుకొస్తున్నాడని వెల్లడించింది.

ఇటీవల ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాధురి దీక్షిత్ మాట్లాడుతూ...'ఆయన ఒక మంచి డాన్స్ మాత్రం కాదు, అయితే చర్మిష్మా మాత్రం ఉంది. అతను డాన్స్ లో ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకోనప్పటికీ, అతను ఎనర్జీతో వేసే స్టెప్పులు ఆకట్టుకునే విధంగా ఉంటాయి' అని అని చెప్పుకొచ్చింది మాధురి.

మాధురి దీక్షిత్ ప్రస్తుతం రణబీర్ కపూర్ హీరోగా రూపొందుతున్న 'యే జవానీ హై దివానీ' చిత్రంలో 'ఘాగ్రా' అనే ఐటం సాంగులో నర్తించిన సంగతి తెలిసిందే. ఈ ఇంటర్వ్యూలో రణబీర్ గురించి గొప్పగా చెప్పుకొచ్చింది మాధురి. ఈ యువ హీరో భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుంది, మంచి పేరు తెచ్చుకుంటాడు. కేవలం స్టార్ గానే కాదు...నటుడిగా గుర్తింపు పొందుతాడు. రణబీర్ గుడ్ డాన్సర్, అతనిలో ఎంతో ఎనర్జీ ఉంది' అని చెప్పుకొచ్చింది మాధురి. మరి ఉన్నట్టుండి షారుక్‌పై ఇలాంటి కామెంట్స్ చేసి రణబీర్‌ను పొగడటం వెనక కారణం ఏమిటో?

ఆ టాప్ హీరోకి డాన్స్ రాదంటూ...హీరోయిన్ కామెంట్

మాధురి దీక్షిత్, షారుక్ ఖాన్ కలిసి పలు చిత్రాల్లో కలిసి నటించారు. అంజామ్, కోయ్‌లా, దిల్‌తో పాగల్ హై, గజా గమిని, హమ్ తుమారే హై సనమ్, దేవదాస్ చిత్రాల్లో కలిసి నటించారు.

ఆ టాప్ హీరోకి డాన్స్ రాదంటూ...హీరోయిన్ కామెంట్

వీరి కాంబినేషన్లో వచ్చిన ‘దిల్‌తో పాగల్ హై' 1997లో విడుదలై అప్పట్లో సెకండ్ హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.

ఆ టాప్ హీరోకి డాన్స్ రాదంటూ...హీరోయిన్ కామెంట్

వీరి కాంబినేషన్లో వచ్చిన దేవదాస్ చిత్రం ఎంపైర్ మేగజైన్ విడుదల చేసిన 100 బెస్ట్ వరల్డ్ సినిమాల్లో 74వ స్థానం దక్కించుకుంది.

ఆ టాప్ హీరోకి డాన్స్ రాదంటూ...హీరోయిన్ కామెంట్

మాధురి డాన్స్ ఎంతో అందంగా ఉంటుందని ఆ మధ్య ఒకసారి షారుక్ వ్యాఖ్యానించారు.

ఆ టాప్ హీరోకి డాన్స్ రాదంటూ...హీరోయిన్ కామెంట్

అయితే మాధురి మాత్రం ఈ సూపర్ స్టార్ మంచి డాన్సర్ కాదు, కేవలం చర్మిష్మాతోనే నెగ్గుకొస్తున్నాడని చెబుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X