షారుక్ ‘జబ్ తక్ హై జాన్’ చిత్రంపై అక్కడ బ్యాన్
షారుఖ్ ఈచిత్రంలో కాశ్మీర్‌లో ఆర్మీ ఆపరేషన్లో పాల్గొనే వ్యక్తిగా కనిపించనున్నాడు. ఈ నేపథ్యంలో ఈ చిత్రంపై అక్కడ బ్యాన్ తప్పదని అంటున్నారు. ఇప్పటికే పాకిస్థాన్ లోని పలు టీవీ ఛానళ్లలో ఈచిత్రం ట్రైలర్ల ప్రదర్శన నిలిపి వేసారు. పాక్ సెన్సార్ బోర్డ్ కఠిన నిర్ణయం నేపథ్యంలో టీవీ చానళ్లలో ట్రైలర్లు ప్రసారం కావడం లేదని, సినిమాపై కూడా నిషేదం తప్పదనే బలమైన వాదన వినిపిస్తోంది.
'జబ్ తక్ హై జాన్' చిత్రానికి యశ్ చోప్రా దర్శకత్వం వహించారు. యష్ చోప్రా ఇటీవలే డెంగ్యూతో మరణించారు. ఈచిత్రంలో షారుక్ ఖాన్, కత్రినా కైఫ్, అనుష్క శర్మ ముఖ్య పాత్రల్లో నటించారు. నవంబర్ 13న ఈ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. ఈచిత్రాన్ని యశ్ రాజ్ ఫిలింస్ బేనర్‌పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఏ.ఆర్. రెహమాన్, సినిమాటోగ్రఫీ: అనిల్ మెహతా, ఎడిటింగ్: నమ్రతరావు, స్క్రీన్ ప్లే: ఆదిత్య చోప్రా, దేవిక భగత్.
ఆసంగతి పక్కన పెడితే... మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ బాలీవుడ్ బాద్ షా షారుఖ్‌తో కలిసి స్క్రీన్ పంచుకోబోతున్నాడు. రామ్ చరణ్ బాలీవుడ్లో నటిస్తున్న 'జంజీర్' చిత్రంలో షారుక్ గెస్ట్‌గా కానీ, స్పెషల్ సాంగులో కానీ కనిపిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.


Click it and Unblock the Notifications












