Shahrukh Khan Dupe: 15 ఏళ్లుగా షారుఖ్ ఖాన్‌కు డూప్... అతని రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాకే!
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆయన తెలుగువారికి కూడా ఎంతో సుపరిచితం. తెలుగు అభిమానులు కూడా ఎంతో ఆయన్ని అభిమానిస్తూ ఉంటారు. మరి అలాంటి ఆయన ఎన్నో సంవత్సరాలుగా సినిమాలు చేస్తూ.. ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. ఏ పెద్ద హీరోలకైనా డూప్ ఉండడం సహజం. మరి షారుక్ ఖాన్ కు డూప్ గా గత 15 ఏళ్లుగా ఓ వ్యక్తి నటిస్తున్నాడట. ఆ వ్యక్తి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బాలీవుడ్ బాద్ షా, సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ నటించిన సినిమాలు ఎంత హిట్ అవుతాయో తెలిసిందే. ఆయన నటిస్తున్న సినిమాలకు ఓ డూప్ ఉన్నారు. ఇక ఆ వ్యక్తి గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. షారుక్ నటించిన తాజా చిత్రం జవాన్. ఇక ఈ చిత్రంలో తండ్రి, కొడుకులుగా షారుఖ్ ఖాన్ మెప్పించాడు. ఈ సినిమాలో తండ్రిగా షారుక్ నటిస్తే డూప్ గా మరొక వ్యక్తి.. షారుఖ్ కొడుకుగా నటిస్తే.. డూప్ తండ్రిగా నటించాల్సి వచ్చిందట. అలా డూప్ గా నటించిన వ్యక్తి గురించి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

షారుక్ ఖాన్ కు డూప్ గా నటించింది ప్రశాంత్ వాల్దే. ఇతడు షారుక్ ఖాన్ కు డూప్ గా ఒక్క జవాన్ సినిమాకే కాదు... గత 15 ఏళ్లుగా షారుఖ్ సినిమాలకు డూప్ గా నటిస్తున్నాడు. డూప్ గా నటిస్తున్నప్పటికీ ఆయన రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ గాను సినిమాల్లో బిజీబిజీగా ఉన్నాడు. తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు విషయాలను బయటపెట్టారు.

ప్రశాంత్ వాల్దే మాట్లాడుతూ... జవాన్ సినిమాలో ఓ సీన్ ఉంటుంది. తండ్రిని కొడుకు హగ్ చేసుకునే సన్నివేశం. అది చేసేటప్పుడు షారుక్ కొడుకు గెటప్ వేస్తే... నేను తండ్రి గెటప్ వేశాను. నన్ను కౌగిలించుకొని తీశారు. నేను కొడుకు గెటప్ వేస్తే షారుఖ్ తండ్రి గెటప్ సీన్స్ చేశారు. అంటే ఒకరోజు మేమిద్దరం వేరువేరు గెటప్స్ వేయాల్సి వచ్చిందని ప్రశాంత్ చెప్పుకువచ్చాడు.
ఇక ఆయన సంపాదన గురించి చెప్తే షాక్ అవ్వాల్సిందే. షారుఖ్ ఖాన్ డూప్ గా నటిస్తున్న ప్రశాంత్ కు రోజుకి 30 వేల వరకు తీసుకుంటాడంట. అంటే నెలకు దాదాపు 9 లక్షలు. సినిమా మొత్తంలో ఇతనికి 30 నుంచి 40 లక్షల వరకు రెమ్యూనరేషన్ అందుతుందని చెప్పుకోవచ్చాడు. ఏది ఏమైనా డూప్ గా నటిస్తూ ఇంత సంపాదించొచ్చు అనే విషయం ఇతన్ని చూశాక అర్థమవుతుంది.
ఇక జవాన్ సినిమా విషయానికి వస్తే... ఇప్పటికే 250 కోట్లకు పైగా గ్రాస్ వసూలు సాధించింది. ఇక ఈరోజు వసూళ్లతో 300 కోట్లు కొల్లగొడుతుందని అంటున్నారు. ఈ చిత్రం గ్యారెంటీగా రూ.1000 కోట్ల మార్క్ క్రాస్ చేస్తుందని ట్రేడ్ అనలిస్టులు చెప్పుకువస్తున్నారు. ఇక ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటించగా.. అట్లీ దర్శకత్వం వహించారు. ఇక విలన్ గా విజయ్ సేతుపతి నటించారు.


Click it and Unblock the Notifications











