హీరోయిన్ చేత లుంగీ కట్టించిన స్టార్ హీరో, డైరక్టర్
న్యూఢిల్లీ: ప్రోమోలు, పోస్టర్స్ వంటి పబ్లిసిటీ అంశాల మీద నేటి దర్శకులు ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఎందుకంటే టీవీలు వదలి థియేటర్ కి జనాల్ని రప్పించాలంటే ఎన్నో మ్యాజిక్ లు, జిమ్మిక్ లు చేయాల్సి వస్తోంది. గతంలోలా మా సినిమాలో ఫలానా ఆర్టిస్టులు ఉన్నారు అని తెలిసేటట్లు పోస్టర్స్ వేస్తే ఎవరికీ ఆసక్తి ఉండటం లేదు. ఈ పబ్లిసిటీకు బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ తేడేలేదు. తాజాగా 'చెన్నై ఎక్స్‌ప్రెస్' సినిమా పోస్టర్ల అందరినీ ఆకర్షిస్తున్నాయి.
హీరో లుంగీమీద కనబడడం సాధారణమే. అయితే హీరోయిన్ కూడా లుంగీమీద కనబడితే.. ఒక్కసారి ఆగి ఆశ్చర్యంగా చూస్తాం. ఇప్పుడు 'చెన్నై ఎక్స్‌ప్రెస్' పోస్టర్ విషయంలో కూడా అదే జరుగుతోంది. ఎందుకంటే ఆ సినిమా పోస్టర్ మీద హీరోయిన్ దీపికా పదుకొనె గళ్ల లుంగీ, ముడేసిన ఎర్రచొక్కా.. పైగా చేతిలో ఓ పిస్టల్ తో దర్శనమిస్తోంది. ఈ పోస్టర్స్ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. మీడియాలో సైతం ఈ పోస్టర్స్ చర్చనీయాంసంగా మారాయి.
దాంతో ఆమెను కలిసిన మీడియావారు.... సినిమాలో మీ పాత్ర ఏంటి? లుంగీ, ముడేసిన చొక్కా, చేతిలో పిస్టల్ కథేంటి? అని దీపికను అడిగారు. మళ్లీ పోస్టర్లో నిలబడినట్లుగా ఓసారి పోజిస్తూ... 'నా లుంగీ వెనుక హీరో షారుఖ్, దర్శకుడు రోహిత్ శెట్టి ఉన్నారంటూ నవ్వేసింది.
అసలు విషయం చెప్పండంటూ మీడియా వారు బతిమాలితే.... సినిమా షూటింగ్ ప్రారంభమయ్యాక ఓ రోజు షారుఖ్, రోహిత్‌లు ఈ లుంగీ ఐడియాతో నా దగ్గరకొచ్చారు. చాలా బాగా వర్కవుటవుతుందన్నారు. నాక్కూడా బాగానే అనిపించింది. వెంటనే అలా పోజిచ్చేశాను'అని చెప్పింది. షారుఖ్, రోహిత్‌లు చెప్పినట్లుగానే వాళ్ల ఐడియా బాగానే వర్కవుటవుతోంది. పోస్టర్ చూసినవారందరూ దీపిక లుంగీ గురించే మాట్లాడుకుంటున్నారు. తెలుగులోనూ ఇదే లుక్ తో మరి ఏ హీరోయిన్ ముందుకు వస్తుందో చూడాలి. గతంలో ఘరానా మొగుడు సినిమాలో నగ్మా ఆల్రెడీ చేసిందంటారా... అయితే ఓకే.


Click it and Unblock the Notifications











