మలేషియా జైల్లో బాలీవుడ్ అగ్రహీరో షారుఖ్
బాలీవుడ్ అగ్రహీరో షారుఖ్ ఖాన్ ప్రస్తుతం మలేషియా జైల్లో ఉన్నాడు. షారుఖ్ ఏమిటి? మలేషియా జైలుకెళ్లడం ఏమిటీ అని ఆశ్చర్యపోతున్నారా? ఇక్కడ ఆశ్యర్య పడాల్సింది ఏమీ లేదండీ. ప్రస్తుతం షారుఖ్ డాన్-2 చిత్రంలో బిజీగా గడుపుతున్నాడు. షూటింగులో భాగంగా గత కొన్ని రోజులుగా షారుఖ్ అండ్ టీం మలేషియాలోని మలక్కా జైలులో మకాం వేశారు. సినిమా షూటింగ్ కోసం జైలు అధికారులు ఓ బ్లాక్ లోని 700 మంది ఖైదీలను వేరే బ్లాక్ కు తరలించారు. రా.వణ్ సినిమా ఆశించిన విజయం సాధించక పోవడంతో చాలా డిస్సప్పాయింటెండ్ గా ఉన్న షారుఖ్...డాన్-2 సినిమా ద్వారా తన సత్తా ఏమిటో చూపించడానికి సిద్దం అవుతున్నాడు. ఈ సినిమాలో హాలీవుడ్ రేంజ్ లో యాక్షన్ సన్నివేషాలు డిజైన్ చేశారు.
ఇప్పటికే సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయినట్లే. డిసెంబర్ 23న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అదే సమయంలో ఈ సినిమాను తెలుగు, తమిళ వర్షన్‌లలో విడుదల కాబోతోంది. ఈ మేరకు త్వరలో డబ్బింగ్ కార్యక్రమాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం ఏమిటంటే...ఈ సినిమా 3డి ఫార్మాట్ లో కూడా విడుదలవుతోంది.
రియలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా గతంలో వచ్చిన 'డాన్" మూవీకి సీక్వెల్. ఫరాన్ అక్తర్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియాంక చోప్రా లీడ్ హీరోయిన్ రోల్ చేస్తుండగా, లార దత్త, సమీర రెడ్డి, కునాల్ కపూర్ ముఖ్య పాత్రల్లో కనిపించ బోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్స్ ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తున్న నేపథ్యంలో బాక్సీఫీస్ వద్ద మంచి ఫలితాలు సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు దర్శక నిర్మాతలు.


Click it and Unblock the Notifications











