twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాకీ లెజెండ్ ‘ధ్యాన్‌చంద్’ బయోపిక్‌లో షారుఖ్

    By Bojja Kumar
    |

    లగాన్, చక్ దే ఇండియా లాంటి క్రీడా ప్రధాన సినిమాలు విజయవంతం అయిన నేపథ్యంలో హాకీ లెజెండ్ ధ్యాన్ చంద్ జీవితాన్ని తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు బాలీవుడ్ నిర్మాతలు. ధ్యాన్‌చంద్‌కు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్లు వస్తున్న తరుణంలో అతని క్రీడా జీవితంపై పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఆసక్తి చూపుతున్నారు. ఓ చిత్రంలో ధ్యాన్‌చంద్ పాత్రను బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ పోషించవచ్చని సమాచారమ్.

    ఈ విషయా న్ని షారుక్ కూడా దృవీకరించాడు. 'ధ్యాన్‌చంద్ పాత్ర కోసం నన్ను సంప్రదించారు. హాకీ ఆడటం నాకు కొత్తకాదు. స్కూల్, కాలే జీ రోజుల్లో హాకీ ఎక్కువగా ఆడేవాడిన'ని షారుక్ చెప్పాడు..ధ్యాన్‌చంద్ తనయుడు అశోక్ కుమార్‌ను బాలీవుడ్ ప్రముఖులు మన్మోహన్ శెట్టి, సత్యజిత్ పూరి సంప్రదించినట్టు తెలుస్తోంది.

    షారుఖ్ ఇటీవల నటించిన రా.వన్, డాన్ 2 చిత్రాలు ఆశించిన ఫలితాలు ఇవ్వక పోవడంతో షారుఖ్ భారీ విజయంపై కన్నేశాడు. తనకు హిట్ కాంబినేషన్‌గా నిలిచిన ఫరాఖాన్ తో విబేధాలకు తెరదించి ఆమెతో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నాడు. త్వరలో వీరి కాంబినేషన్లో 'హ్యాపీ న్యూ ఇయర్' అనే చిత్రం రూపొందుతున్నట్లు తెలుస్తోంది.

    ప్రస్తుతం షారుఖ్ యష్ రాజ్ చోప్రా రూపొందించే ఓ చిత్రంతో పాటు, చెన్నయ్ ఎక్స్ ప్రెస్ చిత్రంలో నటిస్తున్నాడు. వీటితో పాటు కరణ్ జోహార్ రూపొందిస్తున్న కూచికూచి హోతాహై అనే యానిమేటెడ్ చిత్రానికి వాయిస్ ఓవర్ ఇస్తున్నారు.

    English summary
    If everything goes well, then Shahrukh Khan might play the role of legendary hockey player Dhyan Chand in a biopic. Shahrukh Khan has told a leading website that he has been approached for a movie based on the life of legendary Dhyan Chand. He also said that he has been an athlete throughout his school and college life and he has played a lot of hockey.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X