twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'రోబో'ని దాటేసే చిత్రం అంటున్నారు

    By Srikanya
    |

    రజనీకాంత్ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన రోబో చిత్రాన్ని మరిపించే చిత్రంగా షారూఖ్ ఖాన్ 'రా.వన్‌' చిత్రం రెడీ అవుతోందని బాలీవుడ్ లో చెప్పుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం అక్టోబర్‌ 26న తెలుగులోనూ విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. షారూఖ్‌ ఖాన్‌ హీరోగా స్వంతంగా నిర్మిస్తున్న 'రా.వన్‌' చిత్రం షూటింగ్‌ మొదలైన నాటి నుంచి ఇరు చిత్రాల నడుమ పోలిక గురించి సినీ జనాల్లో చర్చ జరుగుతూనే ఉంది. అయితే 'రా.వన్‌' పూర్తిగా విభిన్నమైందిగా షారూఖ్‌ ఖాన్‌ చెప్తున్నారు. ఆయన మాట్లాడుతూ...''ఆ రెండు ('రా.వన్‌', 'రోబో') విభిన్నమైన చిత్రాలు. వేరే వాళ్ల సినిమా గురించి మాట్లాడటం నాకు ఇష్టం ఉండదు. కానీ రజనీకాంత్‌ సార్‌ అంటే మాకందరికి ఎంతో గౌరవం. మా సినిమాలో ఆయన గురించి ప్రస్తావిస్తున్నాం'' అని షారూఖ్‌ తెలిపాడు. సైన్‌ ఫిక్షన్‌ సూపర్‌ హీరో ఇతివృత్తం ప్రధానాంశంగా షారూఖ్‌ ఖాన్‌, కరీనా కపూర్‌, అర్జున్‌ రామ్‌పాల్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న 'రా.వన్‌' చిత్రానికి అనుభవ్‌ సిన్హా దర్శకుడు. అలాగే 'రా.వన్‌' చిత్రాన్ని స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో ఇండియాలోనే నిర్మించినట్టు షారూఖ్‌ చెప్పాడు. ''సినిమాలో మీరు చూసేందంతా కూడా ఇక్కడ నిర్మించిందే... అందుకు మేమెంతో గర్విస్తున్నాం. మా టీమ్‌ గొప్పగా పనిచేసింది. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఒకడుగు ముందుకు తీసుకువెళ్లాం'' అని ఆయన వివరించారు. దక్షిణాది ప్రేక్షకుల కోసం అన్నట్టుగా 'రా.వన్‌' చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో అనువదిస్తున్నారు.

    ''తెలుగు, తమిళ భాషల్లో చిత్రం అనువాద కార్యక్రమాలు ఏక కాలంలో జరుగుతున్నాయి. అంతేకాక జర్మనీ, తదితర భాషల్లో కూడా అనువదించే ఆలోచనలో ఉన్నాం'' అని షారూఖ్‌ వెల్లడించాడు.ఇక షారూఖ్ ... తనకు పిల్లల కోసం ఎప్పుటినుంచో ఓ చిత్రం చేయాలని కోరిక ఉందని, అందులో భాగమే ఈ చిత్రం రూపకల్పన అన్నారు.నేను నిజాయితీగా చెప్తున్నాను..ఎక్స్ మెన్ సిరీస్ నుంచే ప్రేరణ పొందాను అన్నారు.ఇక తాను డైరక్ట్ గా హాలీవుడ్ చిత్రం చేస్తానని అయితే ఆ చిత్రం తన కెరీర్ అతి గొప్ప చిత్రం కావాలని,అందరూ గుర్తు పెట్టుకునేలా ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. యువతను ఆకర్షించేందుకు త్వరలో విడుదలకు సిద్ధమైన రా.వన్ చిత్రంలో కొన్ని సన్నివేశాలలో 3డీ టెక్నాలజీ ఉపయోగిస్తున్నట్టు బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్ తెలిపారు. మంగళవారం రా.వన్ చిత్ర టైలర్ విడుదల సందర్భంగా ఈ విషయాన్ని షారుఖ్ మీడియాకు తెలిపారు. షూటింగ్ అనంతరం కూడా చిత్రాన్ని త్రీడి టెక్నాలజీలోకి మార్చడానికి చర్యలు చేపట్టామన్నారు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంగా రూపొందిన ఈ చిత్రానికి అనుభవ్ సిన్హా దర్శకత్వం వహించారు. కరీనాకపూర్ అర్జున్ రాంపాల్ ముఖ్య పాత్రల్ని పోషించారు. రా.వన్ అంటే రాండమ్ యాక్సెస్ వెర్షన్ అని అర్ధమని షారుఖ్ తెలిపారు.

    English summary
    Ra.One is an upcoming 2011 Hindi science-fiction superhero film ... release during the Diwali weekend of October 26, 2011
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X