ప్రమాదంలో అసిన్..రక్షించిన షారుఖ్
చుట్టూ చూసిన అసిన్ కి కళ్ళు తిరిగినంత పని అయ్యింది. దాదాపు మూడు వందల మంది జనం ఆమెకు ముట్టుకునే దూరంలో ఉన్నారు. అంతే ఉక్కిరిబిక్కిరి అయిన ఆమె చూస్తే ఆమెతో వచ్చిన కంపెనీ స్పోక్ పర్శన్ మాత్రమే ఉన్నారు. దాంతో ఇద్దరూ ఒక్కసారిగా హెల్ప్ అని అరిచారు. ఈ లోగా ఆమె అభిమానులుకు మరింత ఉత్సాహం వచ్చి ఆమెను తాకబోయారు. ఇక అయిపోయింది అనుకున్న సమయంలో ప్రక్క రియల్ హీరోలా రీల్ హీరో షారూఖ్ సీన్ లోకి ఎంటరై తన ఆరుగురు బాడీ గార్డులను ఆదేసించాడు. అంతే వారు రంగంలోకి దూకి జనాన్ని చెదరకొట్టి ఆమె చుట్టూ వలయంలా ఏర్పడ్డారు. కంగారు పడిపోతున్న అసిన్ తో కాసేపు మాట్లాడి ఊరటనిచ్చారు.అప్పుడు షారూఖ్ వెంటనే చెయ్య అందించి ఆమెను ఆ గుంపులోంచి క్షేమంగా బయిటకు తీసుకొచ్చారు. ఇదంతా ఏదో సినిమాలో సీన్ కాదు. నిజంగానే ముంబైలో ఓ పంక్షన్ కి అటెండయిన అసిన్ కి ఎదురైన అనుభవం. అప్పుడు షారూఖ్ కల్గించుకుని ఆమెకు సెక్యూరిటీ విషయమై క్లాస్ పీకాడు. 'ఇలాంటి కార్యక్రమాలకు హాజరయ్యేటప్పుడు కచ్చితంగా బాడీగార్డ్స్ సాయంతోనే రావాలి. లేదంటే ఇబ్బందులు వస్తాయ'ని చెప్పాడు.


Click it and Unblock the Notifications











