»   » షారుక్ ఖాన్ కూతురు...సల్మాన్‌తో చేయాలనే కోరికతో!

షారుక్ ఖాన్ కూతురు...సల్మాన్‌తో చేయాలనే కోరికతో!

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  ముంబై : అవును, మీరు చదవింది నిజమే. షారుక్ ఖాన్ 10 సంవత్సరాల కూతురు ఇప్పుడు చాలా పెద్దదయింది. 14 ఏళ్ల అనంతరం చాలా గ్లామరస్ గా, సెక్సీగా వెండి తెరపై అడుగు పెట్టింది. తన ప్రతిభ నిరూపించుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. అయితే ఆమె షారుక్ రియల్ డాటర్ కాదు....'కుచ్ కుచ్ హోతా హై' చిత్రంలో షారుక్ కూతురుగా నటించిన చిన్నది.

  'కుచ్ కుచ్ హోతా హై' చిత్రంలో షారుక్ ఖాన్‌తో కలిసి నటించిన ఆమె పేరు అంజలి అలియాస్ సనా సయీద్. 24 ఏళ్ల వయసున్న ఈ అమ్మడు ఇటీవల విడుదలైన కరణ్ జోహార్ 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' చిత్రంతో మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.

  ఇటీవల ఆమె మీడియాతో మాట్లాడుతూ.....తనకు షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ లతో కలిసి పని చేయాలని ఉందని తన మనసులోని మాటను బయట పెట్టింది. ఆ అవకాశం మళ్లీ వస్తే అస్సలు వదులుకోను, నా తొలిసినిమా(కుచ్ కుచ్ హోతా హై) చిత్రంలో ఈ ఇద్దరు సూపర్ స్టార్లతో కలిసి నటించే అవకాశం రావడం నా అదృష్టం అని చెప్పుకొచ్చింది.

  1998లో విడుదలైన కుచ్ కుచ్ హోతా హై చిత్రం అప్పట్లో భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇందులో షారుక్, సల్మాన్, కాజోల్, రాణి ముఖర్జీ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో సనా సయీద్ షారుక్, రాణి ముఖర్జీల కూతురుగా నటించింది. ఈ చిత్రానికి కరణ్ జోహార్ దర్శకత్వం వహించారు.

  English summary
  Mumbai: Yes, you read it right. Superstar Shahrukh Khan's 8 year old daughter (Kuch Kuch Hota Hai) is a big girl now. She's back in a glamorous, hot avatar after 14 long years. Well, don't get confused.
 We are talking about Shahrukh's onscreen daughter Anjali aka Sana Saeed from Kuch Kuch Hota Hai. Sana, who's a 24-year-old girl now, made her comeback onscreen with Karan Johar's movie Student Of The Year. Talking to IANS, Sana told that she wants to work with both Shahrukh and Salman Khan.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more