షారుఖ్‌ను ఖుషీ చేసిన కేరళ అభిమానులు
రా.వన్ సినిమా ద్వారా త్వరలో ప్రేక్షకుల ముందు అద్బుతాలు సృష్టించబోతున్నా బాలీవుడ్ బాద్ షా షారుఖ్. రా.వన్ సినిమా ప్రచార పర్వాన్నితన భుజాల మీదేసుకుని తెగ కష్ట పడుతున్నాడు ఈ హీరో. ఈ సారి దక్షిణాది మార్కెట్ పై కూడా కన్నేసిన షారుఖ్ అక్కడ సక్సెస్ కావడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో కేరళకు చెందిన షారుఖ్ అభిమానులు తన కోసం ప్రత్యేక ఓ వెబ్ సైట్ ప్రారంభించడంతో చాలా ఖుషీగా ఉన్నాడు షారుఖ్. ఆ వెబ్ సైట్ పేరు www.srkfanskerala.com.ఇటీవల ఈ వెబ్ సైట్‌కు సంబంధించిన లోగోను ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ సాబు సైరిల్, భారత క్రికెట్ శ్రీశాంత్ తండ్రి శాంతకుమారన్ నాయర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు.
ఇప్పటి వరకు షారుక్‌కు ఉత్తరాదిన చాలా అభిమాన సంఘాలు ఉన్నాయి. కానీ దక్షిణాది మాత్రం లేవనే చెప్పాలి. ఈ నేపథ్యంలో కేరళకు చెందిన తన ఫ్యాన్స్ అంతా కలిసి తమ ఉనికిని చాటు కోవడంతో పాటు, తమ పేరును మరింత పాపులర్ చేయడానికి ముందుకు రావడంతో షారుఖ్ ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. ఈ వెబ్ సైట్ ప్రోమో రా.వన్ సినిమా విడుదలైన థియేటర్లలో దర్శనం ఇవ్వనుంది.


Click it and Unblock the Notifications











