మేకింగ్ ఫన్: సల్మాన్, షారుక్ లిప్ కిస్సింగ్ (ఫోటో)
హైదరాబాద్: సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా ఖాన్ వివాహం.... చాలా కాలంగా అంటీ ముట్టనట్లుగా ఉంటున్న సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ మళ్లీ కలిసి పోయి స్నేహితులయ్యేలా చేసింది. ముద్దుల చెల్లెలు అర్పితను ఇద్దరు స్టార్స్ ఆత్మీయంగా ముద్దాడిన ఫోటో ఇప్పటికే ఇంటర్నెట్లో విడుదలై హడావుడి చేసింది.
ఇపుడు అదే ఫోటోను.....మార్పింగ్ చేసి మధ్యలో నుండి అర్పితను తొలగించి షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ ముద్దాడినట్లుగా క్రియేట్ చేసారు కొందరు ఆకతాయిలు. ఈ ఫోటో ఇపుటు ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ కూడా ఈ ఫోటో చూసారు. ఈ ఫోటో చూసి ఇద్దరు తెగ నవ్వుకున్నారట.

వివాహ వేడుక సందర్భంగా షారుక్... సల్మాన్ ఖాన్ తల్లిని కలిసినపుడు కూడా ఈ ఫోటో విషయమై సల్మాన్ ఖాన్ షారుక్ ను అడిగాడు. ‘మన మార్పింగ్ ఫోటో నువ్వు చూసావా?' అంటూ అడిగా. అందుకు షారుక్ ‘అవును నేను కూడా చూసాను' అంటూ సమాధానం ఇచ్చారు.
‘ఆ ఫోటోలో నీ ఎక్స్ ప్రెషన్స్ చాలా బ్యాడ్‌గా ఉన్నాయి' అంటూ సల్మాన్ వ్యాఖ్యానించగా.......‘నాకంటే బ్యాడ్‌గా నీ ఎక్స్ ప్రెషన్స్ ఉన్నాయి' అంటూ షారుక్ రిప్లై ఇచ్చారు. తర్వాత ఇద్దరూ లోపలికి వెళ్లి ఈ ఫోటో గురించి గుర్తు చేసుకుని నవ్వుకున్నారు.


Click it and Unblock the Notifications











