ఫరాఖాన్ మొగడిపై షారుఖ్ ఖాన్ దాడి
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ తాగిన మైకంలో దాడి చేసిన ఘటన ముంబైలో చర్చనీయాంశం అయింది. షారుఖ్ దాడికి పాల్పడింది ప్రముఖ దర్శకురాలు ఫరాఖాన్ భర్త కావడంతో బాలీవుడ్ లో ఎక్కడ చూసినా ఇదే చర్చ. వివరాల్లోకి వెళితే...ఇటీవల విడుదలైన అగ్నిపథ్ సినిమా భారీ విజయం సాధించిన నేపథ్యంలో సంజయ్ దత్ ముంబైలోని ఆరుస్ రెస్టారెంట్ లో గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశాడు. ఈ పార్టీకి బాలీవుడ్ ప్రముఖులంతా హాజరయ్యారు. ఫిల్మ్ ఫేర్ ఫంక్షన్ నుంచి షారుఖ్ నేరుగా తన ముగ్గురు బాడీగార్డులతో కలిసి ఆ పార్టీకి వచ్చాడని, అప్పటికే అతను బాగా తాగిన మైకంలో ఉన్నాడని, రావడంతోనే ఫరాఖాన్ భర్త శిరీష్ కుందర్ వైపు కోపం వెళ్లి అతని పోడవాటి జుట్టుపట్టుకుని లాగి కింద పడేశాడని, అతనిపై దాడి చేశాడని ప్రత్యక్షంగా చూసిన కొందరు వెల్లడించారు.
రెస్టార్‌రెంట్ ఓనర్ బాబా దివాన్‌ను పిలిచిన షారుఖ్ అతన్ని బయటకు గెంటేయాల్సిందిగా డిమాండ్ చేశాడని, అయితే బాబా దివాన్ అందుకు ఒప్పుకోలేదని చెబుతున్నారు. ఈ దాడితో తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను వారికి దూరంగా ఉన్నానని సంజయ్ అన్నట్లు తెలుస్తోంది. ఆదివారం అర్ధరాత్రి దాటాక ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దాడికి అసలు కారణం తెలియక పోయినా....రా.వన్ సినిమా విడుదల సమయంలో శిరీష్ చేసిన కామెంట్లు షారుక్‌కు కోపం తెప్పించాయని, తాగిన మైకంలో ఉన్న షారుఖ్ కి అతను ఎదురు పడటంతో కోపం ఆపుకోలేక దాడి చేశాడని సమాచారం.


Click it and Unblock the Notifications











