For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  షారూఖ్ 'డీడీఎల్' యానిమేషన్ ట్రైలర్ (వీడియో)

  By Srikanya
  |

  ముంబై : ఓ సినిమా తర్వాతి వారం చూడటం గగనమైపోతున్న రోజులివి. అలాంటిది కంటిన్యూగా ఒకే థియోటర్ లో 1000వారాలు ఆడి రికార్డు క్రియేట్ చేసింది. డిసెంబర్ 12 కు వెయ్యి వారాలు పూర్తవుతుంది. ఆ చిత్రాన్ని ఇప్పుడు రీ రిలిజ్ చేసే ఆలోచనలో ఉన్నారు దర్శక,నిర్మాతలు. అందుకే ఇప్పుడు దాన్ని పురస్కరించుకుని యానిమేషన్ ట్రైలర్ ని వదిలారు. షారూఖ్ ఖాన్ స్వయంగా ఈ లింక్ ని తన ట్విట్టర్ ద్వారా షేర్ చేసాడు. మీకూ చూడాలని ఉందా..అయితే ఇంకెందుకు ఆలస్యం ...చూసేయండి మరి..

  'దిల్‌వాలే...' ప్రదర్శనకు ఇక శుభం కార్డు ముంబయ్‌లోని 'మరాఠా మందిర్' సినిమా థియేటర్లో ప్రస్తుతం ఆడుతున్న సినిమాను ఎత్తేసి, కొత్త సినిమాను ప్రదర్శించబోతున్నారు!సినిమా థియేటర్ అన్న తర్వాత ఆడుతున్న సినిమాను తీసేయడం, కొత్త సినిమా వేయడం సర్వసాధారణం. ఇదీ ఒక వార్తేనా? ఎవరైనా ఇలాగే అనుకుంటారు. కానీ... నిజంగా ఇది వార్తే. సాదాసీదా వార్త కాదు. దేశం మొత్తం నివ్వెరపోయేంత గొప్ప వార్త. ఎందుకంటే... ఆ థియేటర్‌లో ఇప్పటివరకూ ఆడుతున్న సినిమా 'దిల్‌వాలే దుల్హనియా లేజాయింగే'.

  షారుక్‌ఖాన్, కాజల్ జంటగా ఆదిత్యచోప్రా దర్శకత్వంలో యాష్‌చోప్రా నిర్మించిన ఈ చిత్రం ప్రేమకథాచిత్రాలకు ఓ వ్యాకరణం గా మారింది. తెలుగులోనూ ఈ సినిమా ఆధారంగా ఎన్నో సినిమాలు వచ్చాయి..వస్తున్నాయి..రాబోతున్నాయి. ఈ సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని దఫదఫాలుగా కాపీ కొట్టేశారు దేశంలోని చాలామంది దర్శకులు. 1995 అక్టోబర్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలైందీ సినిమా. అప్పట్నుంచీ ముంబయి మరాఠా మందిర్ థియేటర్‌లో ఆడుతూనే ఉంది. అంటే సరిగ్గా ఈ నెల 20కి ఆ థియేటర్‌లో 19 ఏళ్లు పూర్తి చేసుకోబోతోంది.

  Shahrukh Khan Shares Animated Dilwale Dulhania Le Jayenge Promo

  'దిల్‌వాలే దిల్హనియా లేజాయింగే' చిత్రం ఆ థియేటర్లో విడుదలైనప్పుడు... ఆ సినిమా చూసి, దాని ప్రేరణతో ప్రేమలో పడ్డ జంటలు, పెళ్లిళ్లు చేసుకొని పిల్లల్ని కంటే... ఆ పిల్లలు కూడా పెళ్లీడుకొచ్చినా... 'డీడీఎల్' మాత్రం ఆ థియేటర్‌లో ప్రదర్శించబడుతూనే ఉంది. 'డీడీఎల్' ఓ చరిత్ర. చెరిగిపోని చరిత్ర. మళ్లీ తిరిగిరాని చరిత్ర. భారత చలనచిత్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ చరిత్ర. ఆ మాటకొస్తే... ప్రపంచంలోనే కనీవినీ ఎరగని చరిత్ర.

  ఈ సినిమా పుణ్యమా అని ముంబాయ్‌లోని సెంట్రల్ రైల్వేస్టేషన్‌కీ, బస్టాండ్‌కి అతి చేరువలో ఉన్న ఈ 'మరాఠా మందిర్' సినిమా థియేటర్... దేశంలోనే ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. ఈ నెల 20కి 'డీడీఎల్' 20వ ఏట అడుగుపెట్టబోతోంది. ఈ తరుణంలో ఇప్పుడు 'డీడీఎల్' వసూళ్లు తగ్గుముఖం పట్టాయని థియేటర్ యాజమాన్యం ప్రకటించింది. ఈ కారణంగా త్వరలోనే ఈ సినిమాను థియేటర్ నుంచి తొలగించి, మరో సినిమాను తీసుకోవాలని నిర్ణయించారు.

  English summary
  Shahrukh Khan's movie Dilwale Dulhania Le Jayenge (DDLJ), a film that redefined romance in Indian cinema, is completing 1,000 weeks on Dec 12. While a slew of activities is being planned for the day, with a special trailer being launched and an animated DDLJ promo being released today.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X