షారుక్ అండ: సల్మాన్ ‘భజరంగి భాయిజాన్’ ఫస్ట్‌లుక్ (ఫోటో)
హైదరాబాద్: సల్మాన్ ఖాన్ తాజా చిత్రం ‘బజరంగి భాయిజాన్' ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ మరో బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ ట్విట్టర్ పేజీ ద్వారా విడుదల చేయడం విశేషం. ‘హీరోగా ఉండటం కంటే సోదరుడిగా ఉండటమే చాలా గొప్ప విషయమని నేను నమ్ముతున్నా. భాయిజాన్ చిత్రం 2015 ఈద్ కు విడుదలవుతుంది. అందరికీ ఫస్ట్ లుక్ నచ్చిందా? అంటూ షారుక్ ట్వీట్ చేసారు.

ఒకప్పడు షారుక్-సల్మాన్ మధ్య మంచి అనుబంధం ఉండేది. మధ్య కొన్ని కారణాల వల్ల ఇద్దరి మధ్య గొడవలొచ్చాయి. కొన్నేల్ల పాటు ఇద్దరూ మాట్లాడుకోలేదు. స్నేహితుడు సిద్ధికీ ఇచ్చిన ఇఫ్తార్ విందులో ఇద్దరూ మళ్లీ కలిసారు. ఇటీవల జరిగిన సల్మాన్ ఖాన్ సోదరి అర్పిత ఖాన్ వివాహానికి కూడా షారుక్ హాజరయ్యారు. సల్మాన్ ఖాన్ హిట్ అండ్ రన్ కేసుతో ఇబ్బందులు పడుతున్న సమయంలో షారుక్ అతనికి అండగా నిలిచాడు కూడా.
తాజాగా ‘బజరంగి భాయిజాన్' పోస్టర్ తన ట్విట్టర్ పేజీ ద్వారా విడుదల చేయడం ద్వారా తమ మధ్య ఎలాంటి అనుబంధం ఉందో చెప్పకనే చెప్పాడు షారుక్. సినిమా వివరాల్లోకి వెళితే....ఈ చిత్రానికి కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నారు. సల్మాన్ సరసన కరీనా కపూర్ నటిస్తోంది. నవాజుద్దీన్ సిద్దిఖి ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











