ఫోర్బ్స్ టాప్ 100 సెలబ్రిటీ లిస్ట్ (ఫోటోఫీచర్)
ముంబై: ఇండియన్ సినిమా, స్పోర్ట్స్ సెలబ్రిటీలలో సంపాదన, పాపులారిటీ లాంటి విషయాల్లో ఎవరు టాప్ పొజిషన్లో ఉన్నారనే జాబితాను ప్రముఖ ఇంటర్నేషనల్ పత్రిక ఫోర్బ్స్ విడుదల చేసింది. 2013 సంవత్సరానికి సంబంధించిన ఈ జాబితాలో బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ అటు సంపాదనలోనూ, ఇటు పాపులారిటీలోనూ టాప్ పొజిషన్ దక్కించుకున్నాడు. 'చెన్నై ఎక్స్ ప్రెస్' సినిమా విజయం షారుక్ నెం.1 పొజిషన్ అందుకోవడానికి దోహద పడింది.
గత సంవత్సరం ఈ లిస్టులో 3వ స్థానంలో ఉన్న ఇండియన్ క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ...ఈ సారి 2వ స్థానానికి ఎగబాకాడు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ 2వ స్థానం నుంచి మూడో స్థానానికి పడిపోయాడు. ఇక వారి తర్వాతి స్థానాల్లో 4వ స్థానంలో సచిన్ టెండూల్కర్, 5వ స్థానంలో అమితాబ్ బచ్చన్, 6వ స్థానంలో అక్షయ్ కుమార్ నిలిచాడు.
అయితే గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం టాప్ 10 లిస్టు నుంచి ఇద్దరు చోటు కోల్పోయారు. వారెవరో కాదు బాలీవుడ్ హాట్ హీరోయిన్ కరీనా కపూర్, మరొకరు క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్. ఈ సారి కొత్తగా టాప్ 10 లిస్టులోకి రణబీర్ కపూర్(8), హృతిక్ రోషన్(10) వచ్చి చేరారు. క్రికెటర్ విరాట్ కోహ్లి కూడా టాప్ 10 లిస్టులో తన స్థానాన్ని పదిలపరుచుకున్నాడు.
ఇక ఫోర్బ్స్ జాబితాలోని 10 లిస్టులో ఒకే ఒక మహిళకు చోటు దక్కింది. ఆమె మరెవరో కాదు....సెక్సియెస్ట్ హీరోయిన్ కత్రినా కైఫ్. మొత్తం టాప్ 100 లిస్టు వివరాలను స్లైడ్ షోలో చూద్దాం. ఇందులో పలువురు తెలుగు సెలబ్రిటీలు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, నాగార్జున, రవితేజ, రామ్ చరణ్ కూడా ఉన్నారు.

ఫోర్బ్స్ టాప్-10
షారుక్ ఖాన్, మహేంద్ర సింగ్ ధోని, సల్మాన్ ఖాన్, సల్మాన్ ఖాన్, సచిన్ టెండూల్కర్, అమితాబ్, అక్షయ్ కుమార్, విరాట్ కోహ్లి, రణబీర్ కపూర్, కత్రినా కైఫ్, హృతిక్ రోషన్

ఫోర్బ్స్ టాప్-20
దీపిక పదుకొనె, ప్రియాంక చోప్రా, కరీనా కపూర్, ఆమిర్ ఖాన్, వీరేంద్ర సెహ్వాగ్, ఏఆర్ రెహమాన్, సైఫ్ అలీ ఖాన్, అజయ్ దేవగన్, గౌతం గంభీర్, యువరాజ్ సింగ్

ఫోర్బ్స్ టాప్-30
జాన్ అబ్రహం, రోహిత్ శర్మ, కరణ్ జోహార్, హర్భజన్ సింగ్, సోనాక్షి సిన్హా, పవన్ కళ్యాణ్, సురేష్ రైనా, రవీంద్ర జడేజా, ప్రీతమ్, రాహుల్ ద్రావిడ్

ఫోర్బ్స్ టాప్-40
అనుష్క శర్మ, ఇమ్రాన్ ఖాన్, సూర్య, సంజయ్ దత్, విద్యా బాలన్, సైనా నెహ్వాల్, మాధురి దీక్షిత్, సోను నిగమ్, శిఖర్ ధావన్, చటేశ్వర్ పుజారా

ఫోర్బ్స్ టాప్-50
ఇషాంత్ శర్మ, శ్రేయ ఘోషల్, ఇమ్రాన్ హష్మి, అభిషేక్ బచ్చన్, సోనమ్ కపూర్, షాహిద్ కపూర్, కమల్ హాసన్, జహీర్ ఖాన్, విజయ్, ఫర్హాన్ అక్తర్

ఫోర్బ్స్ టాప్-60
ఐశ్వర్యరాయ్, శంకర్ ఎస్సాన్ లాయ్, అనురాగ్ కశ్యప్, మహేష్ బాబు, అర్జున్ రాంపాల్, బిపాసా బసు, కాజోల్, సునిధి చౌహాన్, యోయో హనీ సింగ్, రోహిత్ శెట్టి

ఫోర్బ్స్ టాప్-70
నాగార్జున, సుదీప్, అనిల్ కపూర్, అమిత్ త్రివేది, దర్శన్, రణవీర్ సింగ్, ప్రకాష్ ఝా, రవితేజ, రామ్ చరణ్, ఆయుష్మాన్ ఖురానా

ఫోర్బ్స్ టాప్-80
రిషి కపూర్, లియాండర్ పేస్, శ్రీదేవి, మిక్కా సింగ్, ఇర్ఫాన్ ఖాన్, సాజిద్ ఖాన్, పరిణితి చోప్రా, విశాల్-శేఖర్, సుఖ్విందర్ సింగ్, చేతన్ భగత్

ఫోర్బ్స్ టాప్-90
నవజ్యోత్ సింగ్ సిద్ధు, మలైకా అరోరా ఖాన్, మహేష్ భూపతి, సానియా మీర్జా, శిల్పా శెట్టి, విజేందర్ సింగ్, జీవ్ మిల్కా సింగ్, షాన్, సలీమ్-సులేమాన్, ప్రభుదేవా

ఫోర్బ్స్ టాప్-100
మిథున్ చక్రవర్తి, రెమో డిసౌజా, కపిల్ శర్మ, అమిష్ త్రిపాఠి, వీర్ దాస్, రామ్ కపూర్, రోనిత్ రాయ్, సాక్షి తన్వీర్


Click it and Unblock the Notifications











