Jawan: వైష్ణో దేవి ఆలయంలో షారుఖ్ ఖాన్ పూజలు... ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా?
బాలీవుడ్ బాద్ షా, స్టార్ హీరో షారుఖ్ ఖాన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఇక ఆయన సినిమాలు తెలుగులో డబ్బింగ్ అవుతూ... ఇక్కడి వారిని కూడా అలరిస్తూ ఉంటాయి. ఇదిలా ఉంటే ఆయన ఈ ఏడాది పఠాన్ సినిమాతో హిట్ కొడితే... ఇప్పుడు జవాన్ తో హిట్టు కొట్టేందుకు వస్తున్నాడు. ఇక ఈ సినిమా సెప్టెంబరు 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆయన వైష్ణో దేవి ఆలయాన్ని సందర్శించారు. దానికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి.
సౌత్ సినిమాల హవాతో... బాలీవుడ్ డీలా పడిపోయిన సమయంలో పఠాన్ అంటూ షారుఖ్ ఖాన్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన వసూళ్లు రాబట్టింది. అప్పటి వరకు ఉన్న బహుబలి, కేజీఎఫ్ రికార్డులను కొల్లగొట్టింది. ఇక బాలీవుడ్ కు షారుఖ్ పఠాన్ సినిమాతో పూర్వ వైభవం తీసుకువచ్చాడు. ఇక ఈ సినిమాతో ఇండియా వైడ్ క్రేజ్ తెచ్చుకున్నాడు షారుఖ్.

ప్రస్తుతం షారూఖ్ ఖాన్ నటించిన జవాన్ మూవీ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ సినిమాకు తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో మొదటి సారిగా నయనతార.. షారుఖ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. సెప్టెంబర్ 7న ఈ మూవీ థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం చెన్నై వేదికగా జవాన్ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరగనుంది. ఈ ఈవెంట్ కోసం ఘనంగా ఏర్పాట్లు చేశారు మేకర్స్.
జవాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముందు వైష్ణో దేవి ఆలయాన్ని షారూఖ్ ఖాన్ ఈరోజు సందర్శించారు. జమ్మూలోని వైష్ణో దేవి ఆలయాన్ని ఈరోజు ఉదయం షారుఖ్ సందర్శించాడు. జవాన్ సినిమా రిలీజ్ సమీపిస్తున్న వేళ... అమ్మవారి ఆశీర్వాదాన్ని తీసుకున్నాడు. షారూఖ్ ఖాన్.. వైష్ణో దేవి ఆలయంలోకి వెళుతున్న వీడియో బయటకి వచ్చి ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. భారీ సెక్యూరిటీ మధ్య ఆయన దేవాలయానికి రాగా.... వైట్ షర్ట్, బ్లూ జాకెట్ హుడీ వేసుకున్నాడు.

ఇక షారూఖ్.. ముఖానికి మాస్క్ పెట్టుకున్నాడు. ఆయనకు రక్షణగా పోలీసులు కూడా ఉండగా... మొత్తంగా పటిష్ఠ భద్రత మధ్య షారూఖ్ ఖాన్.. వైష్ణో దేవి ఆలయాన్ని సందర్శించాడు. వైష్ణో దేవి ఆలయాన్ని దర్శించుకోవడం షారూఖ్ ఖాన్‍కు ఇది మొదటి సారి కాదు. ఈ ఏడాది పఠాన్ సినిమా రిలీజ్ కు ముందు కూడా ఆయన ఆలయానికి వచ్చాడు. పఠాన్ సినిమా బ్లాక్ బాస్టర్ కాగా... ఇప్పుడు మరోసారి జవాన్ రిలీజ్ కు ముందు వైష్ణో దేవి ఆశీర్వాదాన్ని షారూఖ్ తీసుకున్నాడు.
ఇక ఈ నేపథ్యంలో జవాన్ కూడా సూపర్ హిట్టుగా నిలుస్తుందని.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని అంటున్నారు షారుఖ్ ఫ్యాన్స్. ఇక ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ కు విలన్ గా విజయ్ సేతుపతి నటిస్తున్నాడు. సాన్య మల్హోత్రా, ప్రియమణి, గిరిజ ఓక్, సన్‍జీత భట్టాచార్య, లెహర్ ఖాన్, ఆలియా ఖురేషి కీలకపాత్రల్లో నటిస్తున్నారు. సెప్టెంబర్ 7న హిందీతో పాటు తెలుగు, తమిళం భాషల్లో జవాన్ రిలీజ్ కానుంది. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‍మెంట్స్ బ్యానర్‌పై షారూఖ్ భార్య గౌరీ ఖాన్.. జవాన్ చిత్రాన్ని నిర్మించారు.


Click it and Unblock the Notifications











