ధూమ్-4లో నటించబోయే హీరో ఎవరో తెలుసా?
హైదరాబాద్: బాలీవుడ్‌లో విడుదలైన ‘ధూమ్' చిత్రం సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాకు సీక్వెల్‌గా రూపొందిన ధూమ్-2, ధూమ్-3 చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద తమ సత్తాను చాటుకున్నాయి. త్వరలో ధూమ్-4 సినిమా కూడా రాబోతోంది.
ఈ చిత్రంలో నటించేందుకు బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ...ధూమ్ సిరీస్ సినిమాలు అంటే ఇష్టం. మోటర్ బైక్స్‌తో విన్యాసాలు చేయడం అంటే నాకు చాలా ఆసక్తి. అందుకే ఆ సినిమాలో నటించాలని ఉంది' అన్నారు.

ధూమ్ సిరీస్ సినిమాలను నిర్మిస్తున్న యశ్ రాజ్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ కూడా ధూమ్-4 షారుక్ తో ప్లాన్ చేస్తోంది. షారుక్ అంటే కలెక్షన్ల వర్షం ఖాయం కాబట్టి తమకూ కలిసొస్తుందని ఆ సంస్థ భావిస్తోంది. వచ్చే ఏడాది ధూమ్-4 సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం యశ్ రాజ్ ఫిల్మ్స్ సంస్థలోనే షారుక్ ‘ఫ్యాన్' అనే చిత్రంలో నటిస్తున్నాడు.
కాగా...షారుక్ ఖాన్ ఇటీవల నటించిన ‘హ్యాపీ న్యూ ఇయర్' చిత్రం భాక్సాఫీసు వద్ద దుమ్ము రేపుతోంది. ఈ చిత్రం త్వరలో 300 కోట్ల మార్కును అందుకునే దిశగా పరుగులు పెడుతోంది. తొలి రోజు 44 కోట్లకు పైగా వసూలు చేసి ఇండియన్ సినిమా చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించింది ఈ చిత్రం.


Click it and Unblock the Notifications











